Food

అందరి కోసం యాపిల్

అందరి కోసం యాపిల్

యాపిల్‌.. పేరుకు, ప్రపంచానికి విడదీయలేని అనుబంధం ఉన్నది. అందానికి యాపిల్‌.. ఆరోగ్యానికి యాపిల్‌.. చిన్నారులు ఇంగ్లిష్‌నేర్చుకోవాలన్నా ‘ఏ ఫర్‌ యాపిల్‌’ అనే.. న్యూటన్‌ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా‘కింద పడ్డ యాపిల్‌’ను చూసే.. అలాంటియాపిల్‌ గురించిన ఆశ్చర్యకరమైన విషయాలు..
మొదటిసారిగా టిబెట్‌లోని ఎత్తయిన పర్వతాలపై యాపిల్‌ పండు కనిపించింది. అప్పుడు దీన్ని చూసినవారు తినేందుకు వెనుకాడారు. ఒకవేళ విషపూరితమైంది అయితే ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డారు. తర్వాత కొద్దికొద్దిగా తిని, ఎలాంటి ప్రమాదం లేదనితెలుసుకున్నారు. అలా యాపిల్‌ రుచిని ప్రపంచానికి పరిచయం చేశారు.
*ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8000 రకాల యాపిల్‌ పండ్లు ఉన్నాయి. రోజుకో రకం తిన్నా.. అన్ని రకాలూ తినేందుకు 21 సంవత్సరాలకు పైగా పడుతుంది.
కశ్మీర్‌ యాపిల్‌.. షిమ్లా యాపిల్‌.. ఇప్పుడు తెలంగాణ యాపిల్‌.. ఇలా ఒక్కో రకం యాపిల్‌కు ఒక్కో రకమైన రుచి ఉంటుంది. ఆ చెట్టు పెరిగే వాతావరణం, అక్కడి మట్టి, నీళ్లు కూడా ఇందుకు కారణమవుతాయి. అలాగే ఒక్కో యాపిల్‌ చెట్టు 100 ఏండ్ల దాకా బతుకుతుంది.
*యాపిల్‌ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. దాని గింజలు అంతకంటే ఎక్కువ చెడు చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలు వ్యక్తి 5 నుంచి 175 గింజలు, చిన్నారులు 5 నుంచి 50 గింజలు తింటే ప్రాణానికే ప్రమాదమని చెబుతున్నారు.
* ప్రపంచంలోనే అత్యంత పెద్ద యాపిల్‌ జపాన్‌లోని హిరోసాకీ నగరానికి చెందిన చిసాటో ఇవాసాకీ పొలంలో కాసింది. దీని బరువు 1.849 కేజీలు.
ఒక యాపిల్‌ పండటానికి తనచుట్టూ ఉన్న 50 ఆకుల నుంచీ శక్తిని లాగేసుకుంటుంది. యాపిల్‌ పండులో 25 శాతం గాలే ఉంటుంది. దీంతో ఇది నీటిలో తేలుతుంది.
*ప్రపంచంలోని అన్ని రకాల యాపిల్‌ పండ్లలో ‘బ్లాక్‌ డైమండ్‌ యాపిల్‌’ అరుదైంది. డార్క్‌ పర్పుల్‌ కలర్‌లో చూడగానే ఔరా.. అనిపిస్తుంది. పర్వతాలపై పండే ఈ యాపిల్‌, సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది. ఫలితంగా దీని పైభాగం పర్పుల్‌, బ్లాక్‌కలర్‌లోకి మారుతుంది. ఒక్కో పండు రూ.300 దాకా పలుకుతుంది.
*ఒక యాపిల్‌ పండటానికి తనచుట్టూ ఉన్న 50 ఆకుల నుంచీ శక్తిని లాగేసుకుంటుంది. యాపిల్‌ పండులో 25 శాతం గాలే ఉంటుంది. దీంతో ఇది నీటిలో తేలుతుంది.
*యాపిల్‌ పండ్ల పెంపకాన్ని ‘పోమోలజీ’ అంటారు. ప్రపంచంలో యాపిల్‌ను ఎక్కువగా పండిస్తున్న దేశం చైనా.
*ప్రాచీన గ్రీకు, రోమన్లు యాపిల్‌ పండ్లను ఐశ్వర్యంగా భావించేవాళ్లు. ఎన్ని ఎక్కువ పండ్లు ఉంటే అంత గొప్ప అన్నట్టు.
*యాపిల్‌ను చూసి భయపడేవాళ్లు కూడా ఉన్నారు. ఆ భయాన్ని ‘మాలుస్‌డొమెస్టికా ఫోబియా’ అంటారు.
*అత్యంత ఖరీదైన యాపిల్‌గా ‘సెకాయ్‌ ఇచి’ గుర్తింపు పొందింది. ఒక్కో పండు ధర రూ.1500 పైచిలుకు ఉంటుంది. జపాన్‌ పదమైన ‘సెకాయ్‌ ఇచి’ అంటే.. ‘వరల్డ్‌ నెంబర్‌ వన్‌’ అని అర్థం.
*న్యూయార్క్‌ నగరానికి ‘బిగ్‌ యాపిల్‌’ అనే నిక్‌నేమ్‌ ఉన్నది.