NRI-NRT

సమయం సందర్భం మాస్క్

సమయం సందర్భం మాస్క్

కరోనా వైరస్ మహమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విలయ‌తాండ‌వం చేస్తూ, ఆరు నెల‌ల‌కు పైగా కాలం గ‌డ‌చిన త‌రువాత‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా మాస్క్‌ ధ‌రించి క‌నిపించారు.

కొన్ని నెలల క్రితం ట్రంప్‌ ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించారు.

తాజాగా ఆయ‌న మాస్క్‌ ధరించి, ఒక ఆసుపత్రిని సందర్శించారు.

ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ సైనికులను చూడటానికి అధ్యక్షుడు ట్రంప్ ఆసుప‌త్రికి వచ్చారు.

ఈ సమయంలో ట్రంప్ ముదురు రంగులో ఉన్న మాస్క్‌ ధరించారు.

కాగా కరోనా వైరస్ వ్యాప్తి అమెరికాలో అధికంగా క‌నిపిస్తోంది.

కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది.

యుఎస్‌లో ఇప్పటివరకు 1,34,000 మందికి పైగా జ‌నం కరోనాతో మృతిచెందారు.

మాస్క్ ధ‌రించ‌డం గురించి ట్రంప్‌ను విలేక‌రులు ప్రశ్నించ‌గా ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు, ముఖ్యంగా ఇక్క‌డి సైనికుల‌తో మాట్లాడుతున్న‌ప్పుడు మాస్క్ ధ‌రించ‌డం ఎంతో మంచిగా అనిపిస్తున్న‌ద‌ని అన్నారు.

తాను మాస్క్ ధ‌రించ‌డానికి ఎప్పుడూ వ్య‌తిరేకం కాన‌ని, అయితే మాస్క్‌ ధ‌రించ‌డానికి స‌మ‌యం, సంద‌ర్భం ఉంటాయ‌ని భావిస్తున్నాన‌న్నారు.