Devotional

తిరుమల బ్రహ్మోత్సవాలకు టెండర్లు

తిరుమల బ్రహ్మోత్సవాలకు టెండర్లు

తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయి పరిశీలన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాటుకు టెండర్లు నిర్వహిస్తున్నామని, అప్పటి పరిస్థితుల మేరకు నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ నెల వరకు తితిదేకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవన్నారు. 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, తలనీలాల విలువ పెరగడంతో రూ.7 కోట్ల ఆదాయం అదనంగా సమకూరిందని వెల్లడించారు.