Agriculture

బ్రేక్ మాన్‌సూన్ అంటే తెలుసా?

బ్రేక్ మాన్‌సూన్ అంటే తెలుసా?

నైరుతి కాలంలో ‘బ్రేక్‌ మాన్‌సూన్‌’గా పిలవబడే రుతుపవనాలు హిమాలయాల పాదాలను తాకే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ గత కొన్ని సంవత్సరాలుగా చవిచూస్తుంది. ఈ ప్రభావమే ప్రస్తుతం నైరుతిపై పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలో పగటి పూట ఎండలు మండుతాయని, మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘బ్రేక్‌ మాన్‌సూన్‌’ వల్ల జూన్‌ నెలలో కొద్దిపాటి వర్షాలు, జులై, ఆగస్టుల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వెళ్లే అవకాశముందని వెల్లడించారు. దీనివల్ల ఉత్తరాంచల్‌, బీహార్‌, సిక్కిం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పంజాబ్‌లలో కొద్దిపాటి వర్షాలు పడతాయి. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉండదని చెబుతున్నారు.