Kids

CBSE పరీక్షాల్లో అమ్మాయిల అద్భుత ప్రదర్శన

CBSE పరీక్షాల్లో అమ్మాయిల అద్భుత ప్రదర్శన

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల…

88శాతం మంది పాస్

Jul 13, 2020 02:06 PM

◆సీబీఎస్ఈ 12 వ తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విడుదల చేసింది. ఈరోజు రిలీజ్ చేసిన ఫలితాల్లో 88.78శాతం మంది విద్యార్థులు పాసైనట్టుగా బోర్డు తెలిపింది. అయితే ఈ ఏడాది మెరిట్ లిస్ట్ ను మాత్రం ప్రకటించలేదు.

◆12 వ తరగతి పరీక్షలకు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా, 10,59,080 మంది విద్యార్థులు పాసయ్యారు.

◆గతేడాదితో పోలిస్తే ఇది నాలుగు శాతం కంటే ఎక్కువని చెప్పొచ్చు.

◆పరీక్షలకు హాజరైన అమ్మాయిల్లో 92.15శాతం మంది పాసైతే, 86.19శాతం మంది అబ్బాయిలు పాసయ్యారు. ఇక ట్రాన్స్ జెండర్ కేటగిరిలో పాస్ శాతం 66.67 ఉన్నట్టు సీబీఎస్ఈ తెలియజేసింది.

◆సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలను results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్ సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు.