ScienceAndTech

OLXపై పోలీసుల నిషేధం

◆ఇక మీదట ఓఎల్ఎక్స్ లో కొనుగోలు అమ్మకాలు జరుప వద్దు అని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

◆ఎందుకంటే.. ఓఎల్ఎక్స్ లో మొత్తం సైబర్ నేరగాళ్లు నిండి పోయారు అని అంటున్నారు. మనము ఏ పోస్టింగ్ చేసిన దానిని సైబర్ నేరగాళ్లు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. భరత్పూర్ , మేవట్ కు చెందిన సైబర్ నేరగాళ్లు ఓఎల్ఎక్స్ లో తిష్ట వేశారు.

◆అందుకే ఓఎల్ఎక్స్ పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు సైబరాబాద్ పోలీసులు.

◆ఓఎల్ఎక్స్ కారణంగా వందల కోట్ల రూపాయలు నష్టపోయారు అంటున్నారు పోలీసులు.

◆ఈ ఓఎల్ఎక్స్ ని ఆసరగా చేసుకొని ప్రజల డబ్బులను లాగేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అందుకే ఓఎల్ఎక్స్ ని పై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాము అని సైబర్ క్రైమ్ ఏ సి పి శ్రీనివాస్ తెలిపారు.

◆అవసరమైతే ఓఎల్ఎక్స్ సైట్ ను నిషేధించాలని కోరాము. అయితే ఈ సైబర్ నేరగాళ్లు జిహెచ్ఎంసి పరిధిలో ని ప్రజలను ఎక్కువగా మోసం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజూ ఓఎల్ఎక్స్ మీద పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి అని తెలిపారు.