DailyDose

పితాని గుండెల్లో గుబులు-తాజావార్తలు

ESI Scam - Pithani Bail Plea Rejected - Telugu Breaking News

* ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్‌ సహా మరో ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట సురేష్‌, పితాని మాజీ పీఎస్‌ మురళీమోహన్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

* కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సీఎం జగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి లేఖ రాశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత జిల్లా కేంద్రమైన అనంతపురం హిందూపురానికి 110 కిలో మీటర్ల దూరంలో ఉందని గుర్తు చేశారు. హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని మరో లేఖలో బాలకృష్ణ కోరారు. దీని కోసం సరిపడ భూమి అందుబాటులో ఉందని లేఖలో ప్రస్తావించారు. మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు రాయలసీమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లేఖలో బాలకృష్ణ పేర్కొన్నారు.

* ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాల భవనాన్ని మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన వల్లే 5 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. కేసీఆర్‌ కిట్ల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లోనే కోట్ల మందికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ఇంకా నమ్మకం పెంచాల్సిన అవసరముందన్నారు. ‘‘ కరోనాకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు భయపడుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా బాధితుడి వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కానీ, ప్రభుత్వ వైద్యులు మాత్రం భయపడకుండా చేర్చుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి ప్రభుత్వ వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు’’ అని కేటీఆర్‌ అన్నారు.

* తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15 వరకు స్టే పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో విచారణ ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇవాల్టి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. తిరిగి దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

* ఏపీలో మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆళ్లనాని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వైద్యకళాశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో సమాజిక ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ. 75 కోట్లతో బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

* సెర్చ్ ఇంజన్ ‘గూగుల్‌’ భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ‘డిజిటైజేషన్‌ ఫండ్‌’ కింద ₹75,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్ పిచయ్‌ వెల్లడించారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్‌లో ఈ పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సుందర్‌ పిచయ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జీవన ప్రమాణాల మెరుగుకు నూతన సాంకేతికత వినియోగంపై ఇరువురు చర్చించారు.

* ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాల భవనాన్ని మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన వల్లే 5 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. కేసీఆర్‌ కిట్ల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లోనే కోట్ల మందికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ఇంకా నమ్మకం పెంచాల్సిన అవసరముందన్నారు.

* రాజస్థాన్‌లో రాజకీయ వేడి కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ తిరుగుబావుటాతో సీఎం అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలను బస్సుల్లో రిసార్టులకు తరలిస్తున్నారు. మొత్తం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు గహ్లోత్‌ ప్రభుత్వానికే ఉన్నట్లు గహ్లోత్‌ వర్గం ప్రకటించింది. అయితే, ఈ సమావేశానికి 97 మంది హాజరయ్యారని తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.

* ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) షాకిచ్చింది. అధిక డేటా స్పీడు అందిస్తామంటూ తీసుకొచ్చిన రెండు ప్లాన్లను నిలిపివేయాలని ఆ రెండు సంస్థలను ఆదేశించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల వర్క్‌ఫ్రమ్‌ హోం సంస్కృతి పెరిగింది. దీంతో డేటా వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో అధిక వేగంతో డేటా అందిస్తామంటూ ఈ రెండు కంపెనీలూ తమ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్ల కోసం ప్రత్యేక డేటా ప్యాక్‌లను తీసుకొచ్చాయి.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ.. వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో వస్తున్న సానుకూల ఫలితాలు భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయినట్లు నిన్న రష్యా వ్యాక్సిన్‌ ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా తన చర్యలను ముమ్మరం చేసింది. చైనాలో కాన్సినో బయోలాజిక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ను ఇతర దేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

* కరోనా అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లు వాడాలని ఏపీ వైద్యారోగ్య శాఖ కోరింది. జిల్లాలకు 20 వేల చొప్పున ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు కిట్లను పంపినట్లు వెల్లడించింది.యాంటీజెన్‌ పరీక్షలో పాజిటివ్‌ తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించింది. సదరు రోగిని ఐసోలేట్‌ చేయాలని కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు సూచించింది. కరోనా లక్షణాలు ఉండి యాంటీజెన్‌ పరీక్షలో నెగటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌ చేయాలని ఆదేశించింది.

* ఫాబిఫ్లూ బ్రాండ్‌పేరుతో కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగిస్తున్న ఫవిపిరవిర్‌ ఔషధం ధరలు తగ్గిస్తున్నామని గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ ప్రకటించింది. ఒక్కో గోలికి దాదాపుగా 27% వరకు ధర తగ్గించామని తెలిపింది. ఫలితంగా రూ.103 బదులు రూ.75కే వినియోగదారులకు తమ ఔషధం అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. స్వల్ప, మోతాదు కరోనా లక్షణాలున్న బాధితులకు దీనిని వినియోగిస్తున్నారు.

* లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికుల‌కు బాస‌ట‌గా నిలిచిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ర‌ణించిన, గాయాల‌పాలైన దాదాపు 400 వ‌ల‌సకార్మిక‌ కుటుంబాల‌ను ఆర్థికంగా ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ‘మృతిచెందిన వ‌ల‌స కార్మికుల కుటుంబాల‌ భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థికస‌హాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. వారికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం నా వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌గా భావిస్తున్నాను’ అని సోనూసూద్ అభిప్రాయ‌ప‌డ్డాడు.