Health

కరోనా మందుబిళ్ల ధర తగ్గింపు-TNI బులెటిన్

కరోనా మందుబిళ్ల ధర తగ్గింపు-TNI బులెటిన్

* ఏమాత్రం అజాగ్ర‌త్తప‌డ్డా మ‌నుషుల్ని పీడించేందుకు క‌రోనా ర‌క్క‌సి సిద్ధంగా ఉంటుంది. చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం కూడా క‌రోనాకు మ‌రింత చేరువ చేస్తుందన‌డానికి ఇక్క‌డ జ‌రిగిన సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న 20 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ ఘ‌ట‌న బిహార్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. బిహార్‌లో వ్యాపార‌వేత్త రాజ్ కుమార్ గుప్తా జూలై 10న అనారోగ్యంతో మ‌ర‌ణించాడు. అయితే అంత్య‌క్రియల్లో పాల్గొన్న‌ అత‌ని మేన‌ల్లుడితో పాటు కుటుంబంలో మ‌రొక‌రికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది.

* రాష్ట్రంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో కరోనా మరణాలురాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మరణాలుకరోనాతో కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతికరోనాతో కృష్ణా, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతికరోనాతో చిత్తూరు జిల్లాలో ఇద్దరు మృతికరోనాతో నెల్లూరు, అనంతపురం, ప.గో. జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిరాష్ట్రంలో 31103కి చేరిన కరోనా బాధితుల సంఖ్యరాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 328 మంది మృతితూ.గో. జిల్లాలో అత్యధికంగా 268 కరోనా కేసులుకర్నూలులో 237, కృష్ణాలో 206, చిత్తూరులో 159 కరోనా కేసులుగుంటూరులో 152, శ్రీకాకుళంలో 145, విజయనగరంలో 138 కరోనా కేసులుప్రకాశంలో 134, అనంతపురంలో 129, నెల్లూరులో 124 కరోనా కేసులుకడపలో 94, ప.గో.లో 79, విశాఖలో 49 కరోనా కేసులు నమోదుఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 13,428 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 15,412 మంది డిశ్చార్జ్‌ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 18 మందికి కరోనావిదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఒకరికి కరోనా24 గంటల వ్యవధిలో 17,624 మందికి కరోనా పరీక్షలురాష్ట్రంలో ఇప్పటివరకు 11.53 లక్షలకు పైగా కరోనా పరీక్షలు.

* ఫాబిఫ్లూ బ్రాండ్‌పేరుతో కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగిస్తున్న ఫవిపిరవిర్‌ ఔషధం ధరలు తగ్గిస్తున్నామని గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ ప్రకటించింది. ఒక్కో గోలికి దాదాపుగా 27% వరకు ధర తగ్గించామని తెలిపింది. ఫలితంగా రూ.103 బదులు రూ.75కే వినియోగదారులకు తమ ఔషధం అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. స్వల్ప, మోతాదు కరోనా లక్షణాలున్న బాధితులకు దీనిని వినియోగిస్తున్నారు.