DailyDose

తల్లిని రోకలిబండతో హతమార్చిన కుమారుడు-నేరవార్తలు

తల్లిని రోకలిబండతో హతమార్చిన కుమారుడు-నేరవార్తలు

* తూర్పుగోదావరిజీల్లా బిక్కవోలు మండల కేంద్రంలో బిక్కవోలు ఎసై వాసు పోలీస్ స్టేషన్ లో స్దానికంగా ఉండే గుంపు బ్యాచ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు…ఇటివల కాలంలో బిక్కవోలు మండల చూట్టు ప్రక్కాల గ్రామాలులో సెల్ ఫోన్లు దొంగతనాలు మరీయు నాటుసారాయి తరిలింపు ఎక్కువ అవుతున్నాయిని కంప్లీట్లు ఎక్కువ వస్తూ ఉండటంతో దానికీ ఈ గుంపు బ్యాచ్ తో సంబంధాలు కలిగి ఉండటం అంతేకాకుండా ఈ గుంపు బ్యాచ్ హత్యలు తో కూడా సంబంధం ఉండటంతో వాసు ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు..ఈ మధ్యకాలంలో మామిడాడలో జరిగిన హత్యతో సంబంధం ఉంది అని తెలిసిన ఈ గుంపు బ్యాచ్ లో వ్యక్తులు పై కుడా కేసు నమోదు చేసి,హెచ్చరికలు జారీచేసారు.. అలాగే భవిష్యత్తులో శాంతి భద్రతలుకు విఘాతం కలిగించకుండా ముందుస్తుగానే వీళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేసి లక్షరూపాయలు పూచీ కత్తుతో బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించి మేజిస్ర్టెట్ ముందు హాజరుపరుస్తామని మీడియాకు తెలియజేశారు..

* పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం సమీపంలోని బాట గంగానమ్మ గుడివద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైనుండి ప్రమాదవశాత్తూ కిందపడి మొక్కపాటి రామకృష్ణ (39) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక రైతుకు చెందిన పొలంలోని వ్యవసాయ బావి కి సంబంధించి విద్యుత్ లైన్ మాన్ తదితరులు మరమత్తులు నిర్వహిస్తుండగా ట్రాన్స్ఫార్మర్ ఎక్కి కిందకు దిగే సమయంలో పట్టు తప్పి రామకృష్ణ కిందపడి తలకు తీవ్రగాయం కావడంతో మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* తూర్పుగోదావరి జిల్లా మండపేట..అప్పుడే కురిసిన భారీ వర్షానికి వేగంగా ప్రవహిస్తున్న మేజర్ డ్రైన్ లో పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన ఐదేళ్ల చిన్నారి చంద్రకళ డ్రైనేజీ లో పడి మృతిచెందింది.

* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఎల్లమ్మ గుడి ప్రక్కన గల ఒక గదిలో తెల్ల కల్లు మాటున కల్తీ కల్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.గత కొన్ని నెలలుగా లాక్ డౌన్ కాలంలో వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు మద్యం విక్రయాలు కూడా బంద్ పాటించడంతో కొన్ని రోజులు తెల్ల కల్లు విక్రయాలు కూడా బంద్ పాటించాయి.మద్యం ప్రియులు చాటు మాటుగా వచ్చి తెల్ల కల్లు త్రాగడం ఇదే అదునుగా భావించిన ముఠా సభ్యులు 30 లీటర్ల తెల్ల కల్లును 300 లీటర్లుగా కల్తీ చేసి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కల్లు పై దృష్టి సారించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ రోజు తయారు చేస్తుండగా దాడి చేసి 300 లీటర్ల కల్తీ కల్లు ను తయారు సామగ్రిని ముఠా సభ్యులని అరెస్ట్ చేసి తదుపరి చర్యలు నిమిత్తం తాల్ల గురజాల పోలీస్టేషన్ తరలించడం జరిగింది.

* పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అదనపు ఎస్.పి కరీముల్లా షరీఫ్ విలేఖరుల సమావేశం. ఆదివారం జీలుగుమిల్లిలో సీలేరు నుండి మహారాష్ట్రకు అక్రమంగా మినీ ట్రావెల్ బస్సులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను విలేఖరుల ముందు ప్రవేశపెట్టి,పూర్తి వివరాలను తెలియచేసిన ఏ.ఎస్.పి కరీముల్లా షరీఫ్.

* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు దేవాలయాల్లో దొంగతనములు చేస్తున్న నిందితుడు అరెస్ట్. ఒక లక్ష 30000 రూపాయల ఆభరణాలు స్వాధీనం వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వరుస దేవాలయాల్లో దొంగతనాలు గురించి ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు ఏ ఎస్ పి మనోహర్ గారి విదేశాలతో టౌన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో జలదంకి ఏ ఎస్ ఐ ఎస్ హరిబాబు మరియు వారి సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి గాలించగా టిపి గూడూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన పాత నేరస్తుడు అయినటువంటి పల్లికొండ శివ నేడు నెల్లూరు నగరం రూరల్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పట్టుకుని విచారించగా జిల్లాలో జరిగినటువంటి 11 సంబంధించిన 2 వెండి శత గోపాలు బంగారు తాళిబొట్టు లను స్వాధీనం చేసుకున్నారు రు వీటి విలువ సుమారు ఒక లక్ష 30000 ఉంటుందని విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఇతని మీద జిల్లాలో 11 కేసులు నమోదైనట్లు నమోదైనట్లు మరియు రెండు సార్లు జైలుకు వెళ్ళినట్లు కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఇతని పట్టుకోవడంలో ప్రతిభ చూపించిన సిసిఎస్ సిబ్బందికి రివార్డు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

* వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల0లోని శివాజీనగర్ గ్రామంలో దారుణం. తల్లిని రోకలి బండతో కొట్టి చంపిన కుమారుడు. హత్యచేసి పరారీలో ఉన్నకుమారుడు రాజు. మృతురాలు కుసుంబ కమలాబాయి. 55 సంవత్సరాలు. మృతురాలికి ఇద్దరు బిడ్డలు. ఒక్క కుమారుడు రాజు.