DailyDose

మణుగూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కలకలం-నేరవార్తలు

Crime News Roundup Today - Maoists In Manuguru Forests

* విశాఖ జిల్లాలో పోలీసులు నిర్వహించిన వేర్వేరు తనిఖీల్లో 572 కిలోల గంజాయి పట్టుబడింది. చోడవరం మండలంలో నిర్వహించిన సోదాల్లో 286 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.గౌరీపట్నం కూడలి వద్ద 168 గంజాయిని పట్టుకున్నారు.వెంకన్నపాలెంలో 118 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.ఈ ఘటనలో పాడేరు మండలం పిండ్రంగి గ్రామానికి చెందిన బొర్రా చంద్రారావును వాహనంతో పాటుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వెంకన్నపాలెం కూడలి వద్ద బొలోరా వాహనంలో తరిలిస్తున్న 118 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన జి.తునాయిక్ ను అదుపులోకి తీసుకుని, నిందితులను రిమాండ్​కు తరలించినట్లు సీఐ ఈశ్వరరావు వివరించారు.

* తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగాఈ రోజు ఉదయం 9గంటలకు మల్లెపల్లితోగు అటవీప్రాంతంలో మావోయిస్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

* ఆర్టీసీ డ్రైవర్ పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఘటన.

* తెనాలి మండలం కఠెవరం గ్రామ సమీపంలో ఆటో – బైక్ ఢీకొని ఆక్సిడెంట్ జరిగినది. అటుగా ప్రయాణిస్తున్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వెంటనే కారు ఆపి, సంఘటన స్థలాన్ని పరిశీలించి , క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి పంపేలా ఏర్పాటు చేసి ,మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

* తిరుపతి….బ్రేకింగ్….విద్యార్థి ఆత్మహత్య. నగరంలోని తుడా రోడ్డులోని వినాయక నగర్ మొదటి అంతస్తులో ఘటన. ఇంటిలో ఎవరూ లేని సమయం లో గ్యాస్ ఓపెన్ చేసి నిప్పంటించుకుని ఆత్మహత్య.