Devotional

కోటప్పకొండ ఆలయం మూసివేత

Kotappakonda Temple Closed Due To COVID19

ఈ నెల 18 వ తేది వరకు కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వర స్వామి దేవాలయం దర్శనం రద్దు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామ కోటిరెడ్డి పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే ఇద్దరు పూజారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో దేవాలయం అంతా కూడా శానిటైజేషన్ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు నేటి నుంచి బుధవారం 15 వ తేది నుంచి శనివారం 18 వ తేది వరకు త్రికోటేశ్వర స్వామి దర్శనం రద్దు చేసినట్లు ప్రకటించారు.