Kids

కుక్కుట శాస్త్రం గురించి మీకు తెలుసా?

కుక్కుట శాస్త్రం గురించి మీకు తెలుసా?

నక్షత్ర ప్రభావం మానవుల మీద ఉంటుందని తెలుసు కానీ, పక్షులు, జంతువుల మీద కూడా ఉంటుందని మీకు తెలుసా…? కోడిపుంజుల గురించిన రాయబడిన పంచాంగాన్ని ‘కుక్కుట శాస్త్రం’ అంటారు. ముఖ్యంగా కోడిపుంజుల్లో రక్త ప్రసరణపై గ్రహ ప్రభావం ఉంటుంది.

27 నక్షత్రాలు పందెం కోళ్ళపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో చూడండి.

అశ్వని
నెమలి – డేగ/కోడి మీద; కాకి- కోడి మీద ; గౌడు- పింగళి మీద గెలుపు

భరణి
నల్ల సవల – నెమలి/ఈటుక ఎరుపు కోడి మీద; పిచ్చుక రంగు గౌడు- నెమలి, ఎర్రపొడ మీద; ఎర్రటి కాకి- కాకి మీద గెలుపు

కృత్తిక
ఎర్ర కాకి- కాకి మీద; పిచ్చుక రంగు గౌడు- నెమలి మీద, ఎర్రపొడ మీద గెలుపు

రోహిణి
నెమలి- నల్ల మైల మీద; పింగళి- ఎర్రకోడి మీద; కాకి- ఎర్రగౌడు ఇంకా కోడి మీద గెలుపు

మృగశిర
కాకి డేగ మీద; డేగ- పసుపు కాకి మీద; పింగళి- కాకి మీద; ఇటుకరంగు డేగ- ముంగిస మీద; కోడి- నెమలి,డేగ మీద గెలుపు

ఆరుద్ర
డేగ – కాకి మీద; కాకి – పింగళి/నల్లమైల/నెమలి మీద; డేగ – పసిమి కాకి మీద; కోడి – వెన్నెపొడ కోడి మీద; నల్లపొడ కోడి – ఎర్రపొడ కోడి/పిచ్చుక రంగు గౌడు మీద గెలుపు

పునర్వాస
కాకి – కోడి మీద, సుద్ద కాకి – కోడి మీద; నెమలి – డేగ మీద; పిచ్చుకరంగు గౌడు – నల్లబోర, ఎర్రకోడి మీద గెలుపు

పుష్య
కాకి – కోడి మీద; పసిమి కాకి – నల్ల కాకి మీద; పింగళి – డేగ, నెమలి మీద; కోడి – నెమలి మీద; కాకి – పింగళి మీద గెలుపు

అశ్లేష
నెమలి – డేగ మీద; పింగళి – తుమ్మెద రంగు కాకి మీద; పసుపు రంగు కాకి – డేగ మీద; కాకి – పిచ్చుక రంగు కోడి మీద; ఎర్ర కోడి – నల్లబోర మీద గెలుపు

మాఘ
డేగ – నెమలి మీద; కోడి – పింగళి మీద; పసుపు రంగు కాకి – డేగ మీద; ఎరుపు నెమలి – నలుపు డేగ మీద; కోడి – గోధుమ రంగు డేగ మీద గెలుపు

పూర్వ ఫల్గుణి/పుబ్బ
కాకి – నెమలి, డేగ, కోడి మీద; నెమలి – పింగళి, కోడి మీద; పింగళి – 3 డేగల మీద గెలుపు

ఉత్తర ఫల్గుణి
కోడి – నెమలి మీద; కాకి – కోడి, డేగ, పింగళి మీద; గోధుమ రంగు డేగ – నలుపు డేగ మీద గెలుపు

హస్త
డేగ – నల్ల మైల మీద; పింగళి – నెమలి మీద; నెమలి – ఎర్రపొడ కోడి మీద; డేగ -పింగళి మీద; పసుపు రంగు కోడి – నెమలి మీద గెలుపు

చిత్త
కోడి – డేగ మీద; నెమలి – కాకి, ఎర్రపొడి కోడి మీద; ఎర్రపొడ కోడి – పిచ్చుక రంగు గౌడు మీద; కాకి – కోడి మీద గెలుపు

స్వాతి
నెమలి – డేగ మీద; నల్ల డేగ – తెల్ల డేగ మీద; పింగళి – ఎర్ర గౌడు, శుద్ధ కాకి మీద; పసుపు రంగు కాకి – నలుపు పొడ కోడి మీద; పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద గెలుపు; కాకి తుంటి నిర్జించును.

విశాఖ
కోడి – నెమలి, డేగ, పింగళి, కాకి మీద; పసుపు రంగు కోడి – డేగ మీద; ఎరుపు రంగు గౌడు – శుద్ధ మైల మీద; ఎరుపు రంగు నెమలి – పింగళి మీద గెలుపు

అనూరాధ
కాకి – నెమలి, నల్ల మైల మీద; నెమలి – కోడి మీద గెలుపు

జ్యేష్టా
పింగళి – కోడి, డేగ మీద; పిచ్చుక రంగు గౌడు – డేగ మీద; పసుపు రంగు కాకి – శుద్ధ కాకి మీద; ఇటుక రంగు పింగళి – నెమలి, కోడి మీద గెలుపు

మూల
కాకి – గోధుమ రంగు డేగ మీద; నెమలి రంగు గౌడు – నల్లపొడ కోడి, నలుపు రంగు కాకి మీద; శుద్ధ కాకి – పసుపు రంగు కాకి మీద; నల్ల సవల – కోడి మీద గెలుపు

పూర్వాషాఢ
డేగ – నెమలి మీద; పసుపు రంగు కాకి – తుమ్మెద రంగు కాకి మీద గెలుపు

ఉత్తరాషాఢ
డేగ – కాకి మీద; నెమలి రంగు గౌడు – నల్ల మెడ గల ఎర్ర కోడి మీద గెలుపు

శ్రావణ
గోధుమ రంగు డేగ – కాకి మీద; కోడి – కాకి, డేగ, పింగళి మీద; తెలుపు నెమలి – నల్ల నెమలి మీద గెలుపు

ధనిష్ట
నెమలి వన్నె కాకి – ఎరుపు రంగు కాకి, కోడి మీద; కోడి – పసుపు రంగు డేగ, నల్లపొడ కోడి మీద గెలుపు

శతభిష
పసుపు రంగు డేగ – నల్లపొడ కోడి మీద; కోడి – కాకి మీద; తెలుపు రంగు నెమలి – శుద్ధ డేగ, శుద్ధ కాకి మీద గెలుపు

పూర్వాభద్ర
కోడి – నెమలి, పసుపు రంగు కాకి మీద గెలుపు

ఉత్తరాభద్ర
నెమలి – కోడి, కాకి మీద; పింగళి – నెమలి, కాకి మీద; డేగ – నెమలి, కాకి మీద గెలుపు

రేవతి
పింగళి వన్నె గౌడు – కోడి మీద; కోడి – డేగ మీద; కాకి – డేగ , పింగళి మీద; పసుపు రంగు కోడి – డేగ , పింగళి మీద;నెమలి – డేగ, కోడి మీద గెలుపు

పందెము కోసం ఏ రోజున ఏ దిశలో కోడిపుంజును వదలాలి?
ఆదివారం, శుక్రవారం — ఉత్తర దిశలో
సోమవారం, శనివారం — దక్షిణ దిశలో
మంగళవారం — తూర్పు దిశలో
బుధవారం, గురువారం — పడమర దిశలో