DailyDose

వరవరరావుకు కరోనా పాజిటివ్-TNI బులెటిన్

వరవరరావుకు కరోనా పాజిటివ్-TNI బులెటిన్

* ముంబయిలోని తలోజా జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజాకవి వరవరరావుకు కరోనా సోకింది. ఆయనకు వైరస్​ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. బీమా కొరేగావ్‌ కేసులో అరెస్టయి 22 నెలలుగా జైలులో ఉన్న వరవరరావును మే నెలలో జేజే ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, చికిత్స పూర్తికాకముందే మళ్లీ జైలుకు పంపించారు.

* రికార్డ్​ స్థాయిలో కొత్తగా 32,695 కేసులు, 606 మరణాలుమహారాష్ట్రలో కరోనా​ మహమ్మారి చెలరేగిపోతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,75,640కి చేరింది. 10,928 మంది వైరస్​కు బలయ్యారు.తమిళనాడులో కేసులు 1,51,820కి చేరాయి. 2,167 మంది ప్రాణాలు కోల్పోయారు.దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,16,993గా ఉంది. మొత్తంగా 3,487 మంది మృతి చెందారు.గుజరాత్​లో మొత్తంగా 44,552 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 2,079మంది కరోనా కారణంగా చనిపోయారు.

* ఏపీ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి. రాష్ట్రంలో కొత్తగా 2,593 కరోనా పాజిటివ్‌ కేసులు.రాష్ట్రంలో 38,044కి చేరిన కరోనా కేసులు.రాష్ట్రంలో కరోనాతో మరో 40 మంది మృతిరాష్ట్రంలో 492కి చేరిన కరోనా మరణాలుతూ.గో. 8, ప్రకాశం జిల్లాలో 8 మంది మృతిచిత్తూరు 5, కడప జిల్లాలో నలుగురు మృతిఅనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చొప్పున మృతికర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిరాష్ట్రంలో కరోనాతో చికిత్స పొందుతున్న 18,159 మంది బాధితులురాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 19,393 మంది డిశ్చార్జి.