DailyDose

ఆ ₹5.2కోట్లు నావే-నేరవార్తలు

Black Money 5.2 Crores Is Mine Says Ongole BusinessMan

* తమిళనాడు సరిహద్దులో పోలీసులకు పట్టుబడిన రూ.5.20 కోట్ల నగదు తనదేనని ప్రకటించుకున్న ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లిబాలు మరిన్ని వివరాలు వెల్లడించారు. నగదు పట్టుబడిన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ను తన డ్రైవరే అతికించినట్లు చెప్పారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు మీద ఉన్న ఆ స్టిక్కర్‌కు కాలం చెల్లిందన్నారు. డ్రైవర్‌ దాన్ని ఎక్కడ సంపాదించాడో తెలియదని బాలు చెప్పుకొచ్చాడు. పట్టుబడిన నగదు తనదేనన్న ఆయన.. శ్రావణ మాసం సందర్భంగా బంగారం కొనేందుకు చెన్నై తీసుకువెళ్తున్నట్లు వివరించారు. రాజకీయ నేతలు విమర్శిస్తున్నట్లు మంత్రి బాలినేనికి సంబంధం లేదని వివరించారు. నల్లమల్లి బాలు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహితుడు కావడం, కార్పొరేటర్‌ అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది.

* జిల్లా సరిహద్దులో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసి వారు సరఫరా చేస్తున్న మద్యం బాటిల్లను సీజ్ చేసిన పోలీస్ అధికారులు.పోలీస్ గ్రౌండ్ లో 14,210 వేలు మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు.

* మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అధికారులతో డీజీపీ భేటీ అయ్యారు.కూంబింగ్ ఆపరేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.డిజిపి మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో ఆదివాసీ జీవితాల్లో అలజడి సృష్టించడానికి మావోలు ప్రయత్నిస్తున్నారు.మైలారపు భాస్కర్ అలియాజ్ అడేళ్లు నేతృత్వంలో 5 గురు మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించారు.దింతో గ్రేహౌండ్స్ దళాలతో తిర్యాణి అడవులలో గాలింపు చేపట్టారు.మావోయిస్టులు ప్రవేశించారని గుర్తించిన పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండి,ప్రతిక్షణం వారి కదలికలను గుర్తిస్తూ,యాంటీ మావోయిస్టు ఆపరేషన్ లు చేపట్టాము.

* చెన్నై లో పట్టుబడిన ఐదు కోట్ల 27 లక్షల రూపాయల నగదు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దేనని పోలీసులకు పట్టుబడిన వ్యక్తులు స్పష్టం చేశారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆరోపించారు. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి, దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ దళితులపైన ఇప్పుడు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల నారుమళ్ళు కుళ్లిపోయాయని, నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

* ఆటలాడుకుంటూ తెలియక చేసిన పని వల్ల ఓ బాలుడి చెయ్యి తెగింది. విశాఖ జిల్లా అనకాపల్లి గ్రామీణ ఎస్సై రామకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. కూండ్రం గ్రామంలో కూలిపని చేసుకుంటూ జీవిస్తున్న చలపరెడ్డి శ్రీను, మంగ దంపతుల కుమారుడు పవన్‌కుమార్‌ (12) నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా, బాలుడు నేరేడుపండ్లు కోసుకోవడానికి సమీపంలోని స్టోన్‌క్రషర్‌ వద్దకు వెళ్లాడు. వైబ్రేటర్‌ వద్ద కన్వేయర్‌ బెల్ట్‌ తిరుగుతుండటంతో దానిని చూస్తూ కుడిచేయి అందులో పెట్టాడు. దాంతో భుజం వరకు చెయ్యి తెగిపడింది. రక్తస్రావం కావడంతో అక్కడినుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. విషయాన్ని గమనించిన క్రషర్‌ గుమస్తా పవన్‌కుమార్‌ని అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు పంపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

* కడప కేంద్ర కారాగారం నుంచి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కేవలం 7గంటలు మాత్రమే కస్టడీకి అనుమతి తీసుకుని ఓర్వకల్లు తీసుకెళ్లారు. వాహనాల అక్రమ రిజిస్టేషన్‌ ఆరోపణలపై ఓర్వకల్లు పోలీస్‌ స్టేషన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈనేపథ్యంలో ఆయన్ను ఓర్వకల్లు పోలీసులు ప్రశ్నించనున్నట్టు సమాచారం.