Agriculture

కామారెడ్డి గిరిజన రైతుల పోరాటం

కామారెడ్డి గిరిజన రైతుల పోరాటం

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ఎక్కపల్లి తండాకు చెందిన 20 మంది రైతులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ భూమి అని చెప్పడం ఏమిటని ఎక్కపల్లి తండా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ఎంపీటీసీ మలోత్ విఠల్ ను ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి, ఎఫ్ డి ఓ అక్రమ కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి కార్యాలయంలో బెదిరింపులు చేయడం విడ్డురంగా ఉందని రైతులు ఆరోపించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని 20 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న తమ భూములపై ఫారెస్ట్ అధికారులు వచ్చి ఫారెస్ట్ పరిధిలో భూమి అని చెప్పడం ఏమిటని రైతులు ప్రశ్నించారు.ఫారెస్ట్ భూముల గుర్తింపు చేపట్టాక ముందే రైతులపై కేసులు నమోదు చేస్తామని కొందరి రైతులను ఫారెస్ట్ కార్యాలయానికి తీసుకరావడంతో తండా వసూలు సుమారు 20 మంది ఎల్లారెడ్డి ఫారెస్ట్ కార్యాలయనికి వచ్చి ధర్నా నిర్వహించారు. మాకు జీవనాధారం కొరకు గతంలో ఎక్కపల్లి గ్రామ శివారులోని 1429 సర్వే నంబర్ గలా 20 మంది రైతులకు రెండు, మూడూ ఎకరాల భూములు పంపిణీ చేసి రెవెన్యూ అధికారులు పట్టా పాస్ బుక్ లు ఇచ్చారని అన్నారు.కానీ ఈరోజు ఫారెస్ట్ అధికారులు వచ్చి భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇట్టి విషయంపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.