DailyDose

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య-నేరవార్తలు

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య-నేరవార్తలు

* మండలంలోని చిన్న తయ్యూరులో కుటుంబ కలహాలతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా… చిన్న తయ్యూరు గ్రామం లో మునస్వామి కుమారుడు సుధాకర్ 35 పాదిరి కుప్పం లోని మేనమామ కూతురు సింధు ప్రియా 25 తో గత 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది .వీరికి శ్రీలత 7 మధుప్రియ 5 సంవత్సరాల కుమార్తెలు ఉన్నారు .గత కొంత కాలంగా కుటుంబ కలహాలు జరిగేవి .సోమవారం ఉదయం నుంచే భార్యా భర్తల మధ్య కలహాలు పెరిగాయి .మధ్యాహ్నం సింధు ప్రియ తన కుమార్తెలు శ్రీలత మధు లతో సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మూడున్నర గంటల ప్రాంతంలో వచ్చిన సుధాకర్ భార్య కుమార్తె బావిలో దూకి ఆత్మహత్య చేసు కొన్న దృశ్యాన్ని చూసి పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

* బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కీలక నేతల వాంగ్మూలం నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ సీనియర్‌ నాయకులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలు ఖరారు చేసింది. జూలై 23న మురళీ మనోహర్‌ జోషి, జూలై 24న అద్వానీల వాదనలు రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు స్పెషల్‌ జడ్జ్‌ జస్టిస్‌ ఎస్‌కే యాదవ్‌ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 313 కింద అద్వానీ, జోషిల వాంగ్మూలం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు.

* 19-07-20 వ తేదీన మధ్యాహ్నం సమయంలో గుంటూరు అర్బన్ అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారు రాబడినబడిన సమాచారం మేరకు, పెదకాకాని పోలీస్ స్టేషన్ ఏరియా కొప్పురావూరు గ్రామానికి వెళ్ళే రహదారిలో ఉన్న గోడౌన్ నందు నిషేదిత గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తుండగా ఇతర అధికారులు / సిబ్బందితో కలసి, చిన్న కొండ్రుపాడు గ్రామానికి చెంది ప్రస్తుతము కొప్పురావూరు గ్రామంలో ఉంటూ గుట్కా తయారీ కేంద్రంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న చెంచు విజయ సింహ, 49 సం.లు అను వానిని పట్టుకొని, పెదకాకాని పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడమైనది. సుమారు రెండు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు ఉంచిన నిస్సాన్ వాహనము , సుమారు పది లక్షల రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్స్ లో ఉపయోగించే ముడి సరుకు మరియు సుమారు ఒక కోటి రూపాయలు పైగా విలువ కలిగిన మిషనరీని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

* ముసునూరు NTR విగ్రహన్ని కూలదోయటం పై సాగుతున్న ప్రతిష్టంభన. NTR విగ్రహన్ని కూలగొట్టన దానిపై విచారణకు వచ్చిన జిల్లా అడిషనల్ యస్పీ వెంకటరత్నం.అడిషనల్ యస్పీ ఒక వర్గానికే కొమ్ము కాస్తుందన్న వైకాపా నాయకులు. విచారణ జరిపేవారు ఇరువర్గాలతో చర్చించాలని డిమాండ్ చేసిన ముసునూరు వైకాపా నాయకులు. గ్రామంలో ఇంతమంది కులాలు ఉన్నాయి కాని ఒక్క కులంతోటే మాట్లాడి కరోనాని అడ్డంపెట్టి అడిషనల్ యస్పీ వెళ్ళపోవడం ఎంత వరకు సమంజసం అంటున్న ముసునూరు వైకాపా నాయకులు. పర్మిషన్ లేని విగ్రహలను ఎందుకు ఉంచుతారు అంటున్న వైకాపా నాయకులు.

* కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామం వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో లారీలో ఉన్న 9 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

* కడపజిల్లాలో యువకుడు దారుణ హత్య..వల్లూరు మండలం లింగయ్యపల్లి గ్రామంలో యువకుడిని దారుణ హత్య..మృతుడి పేరు కదాని మధుసూదన్ 22.ఫోన్ చార్జర్ కోసమై స్వల్ప విషయమై ఘర్షణ పడి కత్తితో పొడిచిన వైనం.అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు అని తెలిసింది.మృతుడికి తండ్రి లేడు తల్లి కువైట్ లో ఉన్నది అమ్మమ్మ దగ్గర ఉన్నాడు.