Health

లాక్‌డౌన్‌లోకి శ్రీహరికోట-TNI బులెటిన్

Sriharikota Under Lock Down - TNILIVE Corona Bulletin

* కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించింది.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షార్ లాక్‌డౌన్ కొనసాగనుంది.వాటర్, కరెంట్, ఫైర్ అవసరాలు మినహా అన్ని సేవలు బంద్‌కానున్నాయి.

* గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నందువలన ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రజలు కొన్ని ముఖ్య జాగ్రత్తలు పాటించాలని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు.

* తిరుపతిలో 72 మంది పోలిసులు కరోనా బారిపడ్డారు… ఇద్దరు పోలీసులు చనిపోయారు.

* తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో అసత్య పోస్టులు హల్‌చల్‌ చేశాయి. దీనిపై ఆయన టీటీడీకి ఫిర్యాదు చేశారు. డాలర్‌ శేషాద్రి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎస్వీ బద్రీపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

* దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కేంద్ర కీలక చర్యలను తీసుకుంటోంది.పరీక్షల నిర్వహణ సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుతోంది.దీనిలో భాగంగానే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,4,40,908 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్‌ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి.వైరస్‌ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది.మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఆదివారం రాత్రి ఆరా తీశారు.వివిధ రాష్ట్రాల ముఖ్యమం‍త్రులకు ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.