DailyDose

అమర్‌నాథ్ యాత్ర రద్దు-తాజావార్తలు

Breaking News - Amarnath Yatra Cancelled

* నేటి నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్ యాత్ర రద్దయింది. కరోనా నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తూ శ్రీ అమర్‌నాథ్ దేవస్థాన బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రారంభమై ఆగస్ట్ 3 వరకూ కొనసాగాలని తొలుత నిర్ణయం తీసుకున్నా ఆఖరు నిమిషంలో రద్దు చేశారు.ఈ నెల 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్వయంగా అమర్‌నాథ్ వెళ్లి మంచు శివలింగం వద్ద పూజలు కూడా చేశారు. దీంతో యాత్ర తప్పకుండా జరుగుతుందని భక్తులు ఆశించారు. అయితే కరోనా మహమ్మరి తీవ్రత నేపథ్యంలో అమర్‌నాథ్ దేవస్థానం బోర్డ్ రద్దు నిర్ణయం తీసుకుంది.

* ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజవర్గాల తెదేపా ఇన్ఛార్జిలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమరావతి రాజధాని తరలిపోకుండా ఏమి చేయాలో అన్నీ చేశామని, ఇంకా పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలకంటే ఏపీనే ఎక్కువ అప్పులు చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయమూర్తిపై దాడి చేసింది మంత్రి అనుచరులేనని ఆరోపించారు. సీఎం అసమర్థత వల్ల కరోనా కేసులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఇంతవరకు సీఎం జగన్‌ మాస్కు ధరించలేదని చెబుతూ.. ఆయనే ధరించకుండా మాస్కు లేకపోతే జరిమానా అనడం ఎంత వరకు సమంజసమని చంద్రబాబు ప్రశ్నించారు.

* అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరినట్టు నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ లాంటి న్యాయ కోవిదుల సలహా తీసుకుని రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సూచించాలని రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలుగు భాషపై మాట్లాడినందుకు తనకు వైకాపా నోటీసు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

* తమ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుల్లో విచారణ ముందుకు సాగేందుకు సహకరించాలని హరియాణా, దిల్లీ పోలీసు విభాగాల్ని రాజస్థాన్ డీజీపీ భూపేంద్ర యాదవ్‌ కోరారు. ఈ మేరకు ఆయన హరియాణా డీజీపీ, దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు మంగళవారం లేఖ రాశారు.

* ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజవర్గాల తెదేపా ఇన్ఛార్జిలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమరావతి రాజధాని తరలిపోకుండా ఏమి చేయాలో అన్నీ చేశామని, ఇంకా పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలకంటే ఏపీనే ఎక్కువ అప్పులు చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.

* అరణ్య భవన్‌లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని సమీక్ష నిర్వహించారు. పశుసంవర్థక, మత్స్య, ఆర్థిక రంగాల్లో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంగన్‌వాడీల ద్వారా గర్బిణీలకు రోజూ పాలు సరఫరా చేస్తున్నామన్నారు. దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని తెలిపారు. విశాఖ డెయిరీ ద్వారా టెట్రాప్యాక్‌ పాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం ఆర్థిక వనరులను సమకూర్చాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. ఈ విషయాన్ని పరిశీలించాలని హరీశ్‌రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. గోపాల మిత్ర వేతన బకాయిలు, పాల సేకరణ ప్రోత్సాహం విడుదల చేయాలని కోరారు.

* ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ సేవలు విస్తరించాలని అన్నారు. కరీంనగర్‌లో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్‌లోని కంపెనీల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందేజేశారు. ఐటీ నిర్వచనం క్రమంగా మారుతోందని కేటీఆర్‌ అభిప్రాయడ్డారు. ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీగా మంత్రి అభివర్ణించారు.

* వారం నుంచి పది రోజుల్లో ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం జరగనుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ అన్నారని తెలిసింది. పొట్టి క్రికెట్‌ వేడుక షెడ్యూలు గురించి ఇందులో చర్చిస్తారని ఆయన తెలిపారు. టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోరనుందని వెల్లడించారు.

* కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తొలిసారి రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభంపై స్పందించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇదొకటంటూ తనదైన శైలిలో విమర్శించారు. ముఖ్యంగా కొవిడ్‌ కట్టడి, చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిరోజూ ఒక అంశాన్ని లేవనెత్తుతూ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని ఘటనల్ని పేర్కొంటూ అవి భాజపా సర్కార్‌ సాధించిన విజయాలంటూ ఎద్దేవా చేశారు.

* స్వదేశీ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో ఇద్దరు వాలంటీర్లకు ఈ వాక్సిన్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు. 14 రోజులపాటు వాలంటీర్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు.

* తిరుపతి నగరంలో లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో ఆఫ్‌లైన్‌ విధానంలో తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీని తితిదే నిలిపివేసింది. చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 40శాతం తిరుపతిలో ఉండటంతో 48 డివిజన్లను కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలోకి చేర్చారు. సర్వదర్శనం టికెట్లు జారీ చేసే భూదేవి కాంప్లెక్స్‌ లాక్‌డౌన్‌ పరిధిలోకి రావడంతో తితిదే టికెట్ల జారీ నిలిపివేసింది.

* ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా సర్కార్‌ గత కొన్ని రోజులుగా సాధించిన విజయాలు ఇవేనంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. భాజపా కూడా కౌంటర్‌ ఇచ్చింది. రాహుల్‌గాంధీ స్టైల్‌లోనే విమర్శించి.. మీరు సాధించిన విజయాలేంటో గుర్తుచేసుకోండని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాహుల్‌ సాధించిన విజయాలివే అంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఎద్దేవా చేశారు. ట్వీట్లకే పరిమితమైన పార్టీగా కాంగ్రెస్‌ విలువ పడిపోయిందని విమర్శించారు.

* రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ ముందు, ఆ తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. అన్‌లాక్‌ సమయంలో 12 నుంచి 13 శాతం కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

* అదనపు సమయానికి వేతనం చెల్లిస్తేనే ఉద్యోగులతో ఎనిమిది గంటలకు మించి పనిచేయించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చామని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి కేంద్రం తెలిపింది. కార్మికులకు ఇష్టమైతేనే నాలుగు కార్మిక చట్టాలకు లోబడే అనుమతించామని వెల్లడించింది.