DailyDose

డిప్యూటీ కలెక్టరుగా కల్నల్ భార్య నియామకం-తాజావార్తలు

Colonel Santosh Wife Appointed As Deputy Collector

* ఇటీవల భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మిత సభర్వాల్ ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇంతక ముందే సంతోష్ బాబు కుటుంబానికి 5కోట్ల రూపాయల ఆర్ధికసాయం మరియు హైదరాబాద్ లో ఇంటిస్థలం కేటాయించారు.

* సచివాలయ భవానల కూల్చివేత కవరేజ్ కి అనుమతి ఇవ్వాలని ధాఖలు చేసిన పిటీషన్ రేపటికి వాయిదా..ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు తమ నిర్ణయం చెపుతామన్న అడ్వొకేట్ జనరల్…కూల్చివేతల సందర్భంగా సచివాలయ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకున్నామన్న ప్రభుత్వం..కూల్చివేతల వద్ద ప్రమాదాలు వాటిల్లుతుందని ఎవ్వరికి అనుమతి ఇవ్వడం లేదన్న ఏజీ..భవానల కూల్చివేతలో ప్రభుత్వం గోప్యత పాటిస్తుందని కోర్టుకు తెలిపిన పిటీషనర్…ప్రజలకు అసలు ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఉందన్న పిటిషనర్..ప్రజలు ప్రసార మద్యమల్లో వారికి తెలిసే ప్రయత్నం చేస్తున్నామన్న పిటీషనర్..ప్రభుత్వం ఎందుకు మీడియా ను అనుమతి ఇవ్వడం లేదన్న హైకోర్టు.

* ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు లో కొనసాగుతున్న ఉద్రిక్తత.పెదబయలు ముంచంగిపుట్టు అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకొన్న మావోయిస్టులు.గాయపడిన మావోయిస్టుల లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్న పోలీసు బలగాలు.పోలీసు బలగాలను లక్ష్యంగా జుండంగి అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు.

* రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం ….ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు.

* నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరు అయ్యారు. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలో నేతలు హాజరు అయ్యారు.

* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన గవర్నర్‌ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్​ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని స్పష్టం చేశారు.హైకోర్టు తీర్పు, ఆదేశాలను వెంటనే అమలు చేయాలని లేఖలో గవర్నర్‌ కోరారు.