Movies

సుశాంత్‌ను చంపింది మూవీ మాఫియానే

సుశాంత్‌ను చంపింది మూవీ మాఫియానే

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతితో బంధుప్రీతి అంశం మరోసారి చర్చకు దారితీసింది. ఇప్పటికే ఈ విషయంపై నటి కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లోని కొందరు పెద్దలను పరోక్షంగా విమర్శించింది. అయితే ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకంగా బాలీవుడ్‌ పెద్దల పేర్లు చెప్పడంతోపాటు వారిని ‘మూవీ మాఫియా’గా అభివర్ణించింది. సుశాంత్ మృతికి ఆ మాఫియానే కారణమని ఆరోపించింది.