DailyDose

తిరుపతిలో తప్పించుకున్న 236 కరోనా పాజిటివ్ రోగులు-TNI బులెటిన్

తిరుపతిలో తప్పించుకున్న 236 కరోనా పాజిటివ్ రోగులు-TNI బులెటిన్

* అధికారులకు షాక్ ఇచ్చిన పాజిటీవ్ పేషేంట్లు.తిరుపతిలో కనిపించని 236 పాజిటీవ్ పేషేంట్లు.ఫోన్ లు స్విచ్ ఆఫ్. పోలీసులకు పిర్యాదు చేసిన అధికారులు.తిరుపతి కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది.కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు.స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్‌ తీసుకునే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నంబర్లు, తప్పుడు అడ్రస్‌ల ను ఇస్తున్నారు.టెస్ట్‌ల్లో రిపోర్ట్ పాజిటివ్ వచ్చాక వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోంది.అయోమయంలో అధికారులు.ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

* ఎన్నారై క్వారంటీన్ నుండి తప్పించుకున్న కరోన సోకిన మహిళనిన్న మహిళను ఎన్నారై క్వారంటీన్ కి అంబులెన్స్ ద్వారా తరలించిన వైద్య సిబ్బంది.తరలించిన కొద్దిసేపటికే ఇంటి దగ్గర ప్రత్యేక్షం.ఆందోళన చెందుతున్న వాలంటీర్లు, వైద్య బృందంపొజిటివ్ కేసు పట్ల నిర్లక్ష్యం వహించిన క్వారంటీన్ యాజమాన్యం

* భర్తకు కొవిడ్‌ తేలడంతో భార్యను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న యజమానితూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్‌ వద్ద అమానుషంఇంట్లో ఉంటున్న వ్యక్తికి కొవిడ్‌ తేలడంతో అడ్డుకున్న యజమానిభర్తకు కొవిడ్‌ తేలడంతో భార్యను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న యజమానిబుర్రిలంకలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న బాధితురాలురాత్రి నుంచి రోడ్డుపైనే బాధితురాలి పడిగాపులు  సొంతింటికి వెళ్లగా అక్కడ కూడా అడ్డుకుని తాళం వేసిన స్థానికులుఅధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదన్న బాధితురాలురాజమహేంద్రవరం కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలి భర్త.

* గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో గురువారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని 2, 5, 18, 21, 31 వార్డులలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

* తమిళనాడులో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉన్నది.బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5,849 మందికి కరోనా నిర్ధారణ కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  1,86,492కు చేరింది. తమిళనాడు  రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.రాజ్‌భవన్‌లోపల  విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది, ఫైర్‌ సర్వీస్‌  స్టాఫ్‌తో సహా 84 మందికి కరోనా సోకింది.

* నెల్లూరు నగరంలో వారం రోజులపాటు లాక్ డౌన్రేపటి నుంచి ఈనెల 31 వరకు నెల్లూరు లాక్ డౌన్.ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే షాపులకు అనుమతి. మెడికల్,పాల షాపులకు సాయంత్రం వరకు అనుమతి. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు కలెక్టర్ సూచన.