ScienceAndTech

మద్రాసులో మొదలైన ఐఫోన్ల తయారీ

మద్రాసులో మొదలైన ఐఫోన్ల తయారీ

ప్రముఖ మొబైల్‌ కంపెనీ యాపిల్‌.. తన ఐఫోన్‌ 11 మోడల్‌ తయారీని భారత్‌లో ప్రారంభించింది. చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో తయారీకి ఇది ఊతమిచ్చే విషయమని ఆయన పేర్కొన్నారు. ఐఫోన్‌ తొలుత ఎస్‌ఈ మోడల్‌ను బెంగళూరు ప్లాంట్‌లో తయారు చేయడం మొదలుపెట్టింది. 2019లో ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మోడల్‌ అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. తాజాగా ఐపోన్‌ 11 తయారీని మొదలు పెట్టింది. త్వరలో ఐఫోన్‌ ఎస్‌ఈ 2020ని కూడా బెంగళూరులోని విస్టర్న్‌ ప్లాంట్‌లో తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌లో తయారీకి యాపిల్‌ మొగ్గు చూపడం గమనార్హం. ఐఫోన్లను ఉత్పత్తి చేసే ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌ కంపెనీలు భారత్‌లో తయారీకి గానూ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్‌, షావోమి వంటి విదేశీ కంపెనీలు దేశంలో తయారీకి ప్రాధాన్యం ఇస్తుండగా.. యాపిల్‌ సైతం అదే బాటలో పయనిస్తోంది. మరోవైపు ఐఫోన్‌ 11 స్థానికంగా తయారుచేయడం వల్ల 20 శాతం దిగుమతి సుంకం ఆ కంపెనీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.