Politics

సృజనాత్మతకు పెద్దపీట వేయాలి

KTR At Mahindra University Launch In Hyderabad

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మహీంద్రా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాతో కలిసి ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. మహీంద్రా గ్రూప్‌ సంస్థల మాదిరిగా యూనివర్సిటీ సైతం అత్యున్నత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని యూనివర్సిటీ యాజమాన్యానికి కేటీఆర్‌ సూచించారు. యూనివర్సిటీ రూపకల్పనలో క్రియాశీలక పాత్ర వహించిన ఆనంద్‌ మహీంద్రాకు, మహీంద్రా గ్రూప్‌కి ఈ సందర్భంగా కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.