NRI-NRT

అమ్మభాష ఆవశ్యకత గుర్తించిన తానాకు అభినందనలు

Vice President Venkaiah Naidu Inaugurates WTCF TANA 2020

మాతృభాష తెలుగును భావితరాలకు అందిచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అమ్మభాషను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. తానా ఆధ్వర్యంలో వర్చువల్‌గా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేశారు. మాతృభాష కోసం ప్రవాస తెలుగు సంఘాలు చేస్తున్న కృషిని వెంకయ్యనాయుడు కొనియాడారు. తానా సమన్వయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలతో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ప్రస్తుత సమయంలో తెలుగువారందరికీ సాంత్వన కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చొరవ తీసుకున్న తానాను ఆయన అభినందించారు.