Business

భారీగా ఇన్ఫోసిస్ షేర్ల అమ్మకం-వాణిజ్యం

భారీగా ఇన్ఫోసిస్ షేర్ల అమ్మకం-వాణిజ్యం

* ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్‌డీ షిబులాల్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున ఇన్ఫోసిస్‌ షేర్లను విక్రయించారు. జూలై 22-24 తేదీలలో కంపెనీకి చెందిన 85 లక్షల షేర్లను విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ అమ్మకానికి సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్యవర్తిత్వం వహించగా, వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాతృత్వం, పెట్టుబడి కార్యకలాపాలకు వినియోగించనున్నామని షిబులాల్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

* నిజానికి స్టాక్‌ మార్కెట్లలో లాభాల కోసం అత్యధిక శాతం మంది దీర్ఘకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటారు. స్వల్పకాలిక లాభాల కోసం ట్రేడర్లు ఎఫ్‌ండ్‌వో స్టాక్స్‌లో భారీగా పొజిషన్లు తీసుకుంటుంటారు. అయితే కొద్ది రోజులుగా రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు శామ్‌కో గ్రూప్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా పేర్కొంటున్నారు. దీంతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇటీవల ఆటుపోట్లు పెరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

* మార్కెట్‌ ఓవర్‌బాట్‌ కండీషన్‌లో ఉందని ఈ తరుణంలో తాజా కొనుగోళ్లు చేయవద్దని, లాభాల స్వీకరణే శ్రేయస్కరమని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. వచ్చేవారం స్టాక్‌ మార్కెట్‌ కదలికలపై సామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమోదీ తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. సూచీలు ఈ వారంలో భారీగా ర్యాలీ చేశాయి. నిఫ్టీ ర్యాలీ కాంట్రిబ్యూషన్‌లో షేర్ల పార్టిసిపేషన్‌ చాలా తక్కువగా ఉందని గమనించవచ్చు. ఇప్పటి వరకు వెల్లడైన కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. అయితే ప్రముఖ కంపెనీల నుంచి ఫలితాలు ఇంకా రాలేదు. బహుశా వాటి ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపరచవచ్చు.

* కె.రహేజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ(రీట్‌) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూ ధర రూ. 274-275కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 200 యూనిట్లకు బిడ్స్‌ దాఖలు చేయవలసి ఉంటుంది. యూనిట్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌చేయనుంది. ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఇప్పటికే మైండ్‌స్పేస్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్లను విక్రయానికి ఉంచగా.. మరో రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ తదుపరి వస్తున్న రెండో రీట్‌ ఇష్యూ ఇది. ఎంబసీ ఆఫీస్‌ రీట్‌ ద్వారా రూ. 4,750 కోట్లు సమీకరించిన విషయం విదితమే.

* వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా భారీ హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ప్రభావాన్ని చూపగల అమెరికన్‌ కేంద్ర బ్యాంకు.. ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను చేపట్టనుంది. మంగళవారం ప్రారంభంకానున్న పరపతి సమావేశాలు బుధవారం(29న) ముగియనున్నాయి. మరోవైపు జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్‌ గడువు గురువారం(30న) ముగియనుంది. దేశీయంగా నేడు(25న) ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనుంది. ఈ అంశాల నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సంచరించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4శాతం ర్యాలీ అండతో నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకుని 21 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,194 వద్ద స్థిరపడింది. అయితే సాంకేతికంగా కీలకమైన 11200 స్థాయిని నిలుపుకోలేకపోయింది. నిఫ్టీ వీక్లీ, డైలీ ఛార్ట్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పాటైనప్పటికీ.., ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించాలని వహించాలని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీకి కొనుగోళ్ల మద్దతు లభించి మరింత ర్యాలీ చేస్తే 11,300-350 పరిధిలో అమ్మకాల ఒత్తిడికి ఏర్పడుతుందని వారంటున్నారు. ఇక డౌన్‌ట్రెండ్‌ 11,100 వద్ద కీలకమైన మద్దతు స్థాయిని కలిగి ఉందని వారు అంచనావేస్తున్నారు. వచ్చే వారం లాభాల బుకింగ్‌కు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు.

* దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో శుక్రవారం 10గ్రాముల బంగారం ధర రూ.335 లాభపడి రూ.51035.00 వద్ద స్థిరపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా బంగారం ధర బలపడినట్లు బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫండల్‌మెంటల్స్‌ పరిశీలిస్తే బంగారం ధర మరింత ర్యాలీ చేసే అవకాశం ఉందని వారంటున్నారు.ఈ వారంలో బుధవారం తొలిసారి రూ.50వేల స్థాయిని అందుకుంది. కొనుగోళ్ల మద్దతు మరింత పెరగడంతో రూ.51,184 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ వారం మొత్తం మీద బంగారం ధర రూ.2068(4.22శాతం) లాభపడింది.