Sports

తిరిగి రింగులోకి రానున్న టైసన్

తిరిగి రింగులోకి రానున్న టైసన్

బాక్సింగ్‌ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది మైక్‌ టైసన్‌. 20 ఏళ్ల వయసులోనే ట్రివర్‌ బెర్బిక్‌ను ఓడించి హెవీ వెయిట్‌ ఛాంపియన్‌ షిప్‌ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. బాక్సింగ్‌ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నటైసన్‌ 2005లో రిటైర్డ్‌ అయ్యాడు. అయితే మళ్లీ రింగ్‌లోకి దిగాలని మైక్‌టైసన్‌ భావిస్తున్నాడు. సెప్టెంబర్‌ 12న 4 డివిజన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ రాయ్‌జోన్స్‌ జూనియర్‌తో తలపడనున్నాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఒక మ్యూజిక్‌ ప్లాట్‌ఫాం ద్వారా టైసన్‌ పంచుకున్నాడు.