Business

గుహల తేనె కిలో ₹5లక్షలు

గుహల తేనె కిలో ₹5లక్షలు

టర్కీ దేశం ఖరీదైన తేనెలకు ప్రసిద్ధి. అక్కడి అంజర్‌ మైదాన ప్రాంతంలో సేకరించే తేనెకు ఔషధ శక్తి ఉంది. మిగతా తేనెల్లో వందగ్రాములకు 6.5మి.గ్రా. విటమిన్‌ సి ఉంటే ఈ తేనెలో ఏకంగా 25 మి.గ్రా. ఉంటుందట. ఖరీదైన తేనెగా పేరొందిన ఈ అంజర్‌ తేనెని కూడా వెనక్కి నెట్టేసింది టర్కీకే చెందిన ఎల్విష్‌ హనీ. సరికాయిర్‌ అనే లోయ దగ్గర పెద్ద సంఖ్యలో తేనెటీగలు ఓ గుహలోకి వెళ్లిరావడాన్ని చూశాడు గుండుజ్‌ అనే తేనె సేకర్త. 1800మీ. లోతున్న ఆ గుహ లోపలికి పర్వతా రోహకుల సాయంతో వెళ్లిన గుండుజ్‌ అక్కడున్న పెద్ద పెద్ద తేనెతుట్టెల్ని చూసి ఆశ్చర్యపోయాడు. వాటినుంచి 18 కిలోల తేనె సేకరించుకొచ్చిన అతను, ఆ తేనె రుచి అద్భుతంగా ఉండటంతో దాని ఔషధగుణాల్ని విశ్లేషించమని ఫ్రాన్స్‌లోని ప్రయోగశాలకు పంపించాడు. ఖనిజాలూ విటమిన్లూ అందులో పుష్కలంగా ఉన్నా యని తెలియగానే కిలో తేనెను రూ.38 లక్షలకు పోటీపడి కొన్నారు తేనెప్రియులు. అప్పటినుంచీ దాని ఖ్యాతి దేశవిదేశాలకూ వ్యాపించింది. గత పదేళ్లుగా అలా గుహల ïెంబడి తిరుగుతూ తేనె సేకరిస్తున్న గుండుజ్‌ ‘ఎల్విష్‌ హనీ’ పేరుతో దాన్ని విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ తేనె ధర కిలో అయిదు లక్షల రూపాయల పై మాటే.