DailyDose

గల్లాకు హైకోర్టులో ఊరట-తాజావార్తలు

గల్లాకు హైకోర్టులో ఊరట-తాజావార్తలు

* తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ముగిసిన విచారణగతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వంఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వందీనిని సవాల్‌ చేస్తూ అమర‌రాజా సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలున్యాయస్థానం విచారణ జరిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ.

* అయోధ్య రామ మందిర నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీన భూమిపూజను నిర్వహించనున్నారు. భూమిపూజ పూర్తైన వెంటనే మందిర నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మూడు లేదా మూడున్నర ఏళ్లలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా మొఘల్ చక్రవర్తుల వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ కీలక ప్రకటన చేశారు. ఒక కేజీ బరువున్న బంగారు ఇటుకను ప్రధాని మోదీకి అందిస్తానని… ఈ ఇటుకను రామ మందిర నిర్మాణంలో వాడొచ్చని చెప్పారు. మందిర నిర్మాణం 100 కోట్ల హిందువుల నమ్మకమని… ఈ సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. మోదీని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్ మెంట్ కోరానని చెప్పారు.

* భారత్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో దాదాపు అర లక్ష కేసులు నమోదవడం ఈ మహమ్మారి వ్యాప్తి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 14,35,453 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. పాజిటివిటీ రేటు 9.68%గా ఉంది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు 82.71% కేసులు (దాదాపు 11లక్షలకు పైగా కేసులు) కేవలం 10 రాష్ట్రాల్లో, 85శాతానికి పైగా మరణాలు 7 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం.

* భారత వాయుసేన అమ్ములపొదిలో చేరేందుకు ఫ్రాన్స్‌ నుంచి ఐదు రఫేల్‌ యుద్ధవిమానాలు సోమవారం బయల్దేరాయి. ఈ విషయాన్ని వాయుసేన ట్విటర్‌లో పంచుకొంది. ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్‌ నుంచి రెండు దశల్లో సాగే ఈ ప్రయాణానికి ఫ్రాన్స్‌ వాయుసేనకు చెందిన ట్యాంకర్‌ విమానం కూడా అండగా రానుంది. అవసరమైనప్పుడు గాల్లోనే ఇంధనం నింపుకొని ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది.

* తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జీవో జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ అమర‌రాజా సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

* సకాలంలో రవాణా సౌకర్యం లేదన్న కారణంతో అస్వస్థకు గురైన ఓ వ్యక్తిని స్థానికులు గ్రామ పంచాయతీ చెత్త రిక్షాలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ. భీమవరం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… విజయవాడకు చెందిన సతీష్‌ కుమార్‌ అనే వ్యక్తి ఐ. భీమవరం బస్టాండ్‌లో రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గమనించిన పంచాయతీ అధికారులు, ఆరోగ్య సిబ్బంది అతడిని ఆకివీడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

* ప్రభుత్వం నుంచి పంపే కరోనా నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షలకు ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఐసీఎంఆర్‌ అనుమతించిన ప్రైవేటు ల్యబ్‌లలో కొవిడ్‌ పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు రూ. 750 కంటే ఎక్కువ వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

* రాష్ట్రంలో కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. ఇటీవల వైకాపాతో విభేదిస్తూ వస్తున్న రఘురామకృష్ణరాజు ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరోనా పరిస్థితులపై స్పందించారు.

* విపక్ష నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను అంటించే కుట్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పెద్ద రాజకీయ కుట్రదారు అని.. ఏ స్థాయికైనా దిగజారుతారని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్. ముఖ్యమంత్రిని విమర్శించే వాళ్లను అరెస్టు చేయిస్తున్నారు. పోలీసు స్టేషన్‌లో, పోలీసు వాహనాల్లో శానిటైజ్‌ చేయడం లేదు. నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు సరికాదు.

* కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేశుని ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. వినాయకుడి పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు కోరారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సెప్టెంబర్‌ 1వ తేదీన సామూహిక నిమజ్జనం వీలుకాదని.. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ నిమజ్జనం జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

* రాజస్థాన్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. శాసనసభ సమావేశాలను వెంటనే నిర్వహించాలన్న సీఎం అశోక్‌ గహ్లోత్‌ సిఫార్సును గవర్నర్‌ తిరస్కరించారు. అసెంబ్లీని సమావేశపర్చాలని ఇప్పటికే రెండుసార్లు గవర్నర్‌కు మంత్రివర్గం ప్రతిపాదనలు పంపింది. తొలిసారి ఆరు పాయింట్లపై స్పష్టత కోరిన గవర్నర్‌ ఈసారి అదనపు సమాచారం కావాలని ఫైల్‌ను తిప్పి పంపారు.

* బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైన వేళ దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 194 పాయింట్లు నష్టపోయి 37,934 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 62 పాయింట్ల నష్టంతో 11,131 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.83 వద్ద ట్రేడ్‌ అవుతోంది.