Politics

పరిశ్రమల భద్రతపై జగన్ సమీక్ష

పరిశ్రమల భద్రతపై జగన్ సమీక్ష

‘పరిశ్రమలు ఎంత ముఖ్యమో, వాటి భద్రత కూడా ఎంతో కీలకం. వీటివల్ల వచ్చే కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడకూడదు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. విశాఖలో గ్యాస్‌ దుర్ఘటన దృష్ట్యా సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంపుపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు సంబంధించి సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంస్కరణలకు సంబంధించి మార్గదర్శకాలపై చర్చిస్తూ…..కొవిడ్‌ నుంచి పారిశ్రామిక రంగాన్ని వేగంగా పట్టాలపైకి తెచ్చేందుకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని కేంద్రం చెబుతోందని సీఎం తెలిపారు. ఉచిత విద్యుత్‌ వల్ల ప్రభుత్వంపై పడే భారాన్ని తగ్గించుకునేందుకు, పగలే 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేసే దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టు ద్వారా తక్కువ ధరకు లభించే విద్యుత్‌ను రైతులకు అందిస్తామన్నారు.