Health

గత 24గంటల్లో ఏపీలో 10093 కరోనా కేసులు-TNI బులెటిన్

గత 24గంటల్లో ఏపీలో 100093 కరోనా కేసులు-TNI బులెటిన్

* AP lo Last 24 hours lo 10093 Positive Cases and 65 Deaths.

* దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.నిత్యం దాదాపు 48వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48,513 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 15,31,669కు చేరింది.దేశంలో మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 700 కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి.గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 768మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు.దీంతో కరోనాతో మరణించిన వారిసంఖ్య 34,193కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.కరోనా బాధితుల్లో ఇప్పటికే 9,88,029 మంది కోలుకోగా మరో 5,09,447 క్రియాశీల కేసులు ఉన్నాయి.

* కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ శెల్వి కి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు.

* ఆర్మూర్ ఎమ్మెల్యే  ఆశన్నగారి జీవన్‌రెడ్డికి పాజిటివ్ గా తేలింది.దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు.ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఎమ్మెల్యే హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు.కాగా, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కొవిడ్‌ బారినపడి కోలుకున్నారు.నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

* వైరస్ లక్షణాలు కలిగిన వారికి చికిత్స అందించే నిమిత్తం అన్ని సదుపాయాలతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి వీటికి కింది పేర్కొన్న నోడల్ అధికారులను నియమించటం జరిగింది. మీకేదైనా సమస్య ఉన్నచో వీరికి వాట్సాప్ చేయటం ద్వారా తగిన సహకారం పొందగలరు.

▪ అనంతపురం: 9493188891
▪ చిత్తూరు 9491077099
▪ తూర్పు గోదావరి 9849903862
▪ గుంటూరు 9121008008
▪ కడప 9849900960
▪ కృష్ణ 9100997444
▪ కుర్నూలు 9849902412
▪ నెల్లూరు 9704501001
▪ ప్రకాశం 9063455577
▪ శ్రీకాకులం 7995225220
▪ విశాఖపట్టణం 9000782783
▪ విజియనగరం 9491012012
▪ పశ్చిమ గోదావరి 9966553424, 9849903590

కరోనా వైరస్ గురించిన సూచనలు/సలహాలు/ఫిర్యాదుల కొరకు సంప్రదించండి:
☎ కాల్ సెంటర్: 104, 0866-2410978
? ఈ మెయిల్ : covid-19info@ap.gov.in

* 1764 new positive cases in Telangana last 24 hours and 12 deaths.