Kids

ఇండియాలో నూతన జాతీయ విద్యా విధానం

ఇండియాలో నూతన జాతీయ విద్యా విధానం

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం
కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్

కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం

నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం

దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురానున్న కేంద్రం

నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు సమాచారం

5+3+3+4 విధానంలో విద్యా విధానం అమలులోకి రానున్నట్టు సమాచారం.

3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం నూతన విద్యా విధానం

కొత్త విద్యా విధానంలో మారనున్న సిలబస్ అంశాలు

వృత్తి, ఉపాధి లభించే విధంగా నూతన విద్యా విధానం ఉపయోగ పడుతుందంటున్న కేంద్రం

నూతన విద్యా విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా, ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారని సమాచారం

నూతన విద్యా విధానం కోసం ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం

మరికాసేపట్లో నూతన విద్యా విధానం పై పూర్తి స్పష్టత ఇవ్వనున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియల్