Health

గబ్బిలాల్లో తరతరాలుగా కరోనా

గబ్బిలాల్లో తరతరాలుగా కరోనా

కరోనా వైరస్‌ మూలాలు కొన్ని దశాబ్దాలుగా గబ్బిలాల్లో గుర్తించని విధంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హార్స్‌షూ అనే గబ్బిలాల్లో సార్స్‌- కొవిడ్‌-2 వ్యాధిని కలిగించే వైరస్‌ ఉన్నట్లు పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌ డైనమిక్స్‌కు చెందిన మాసిజ్‌ బోని నేతృత్వంలోని పరిశోధకులు తేల్చారు. ఈ అధ్యయనం నేచర్‌ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా మహమ్మారితో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 6,54వేలమంది మరణించారు. అలాగే ఈ మహమ్మారి కారణంగా పలు దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలయ్యాయి. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని యూఎస్‌ ప్రభుత్వ అధికారులు ఆరోపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఈ నెలలో దీనిని అధ్యయనం చేసేందుకు నిపుణులను చైనాకు పంపింది. ఈ సందేహాలను నివృత్తి‌ చేసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు కూడా పలు కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు.
‘వైరస్‌ వంశాన్ని గుర్తించడం వల్ల, వాటి నుంచి మనుషులకు సోకకుండా జాగ్రత్త పడొచ్చని’ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి ప్రారంభంలోనే వైరస్‌ మూలాలను గుర్తించడం అత్యంత ముఖ్యమని, దీంతో మానవులకు వ్యాపించకుండా అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేయవచ్చని అన్నారు. గబ్బిలాల్లోని ఇతర వైరస్‌లు మానవులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు హెచ్చరించిన సంగతి తెలిసిందే