DailyDose

సాఫ్ట్‌వేర్ శారద దుకాణంలో చోరీ-నేరవార్తలు

సాఫ్ట్‌వేర్ శారద దుకాణంలో చోరీ-నేరవార్తలు

* ‘సాఫ్ట్‌వేర్ శారద’ ఇటీవల ఈ పేరు అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఆమె ఉద్యోగం కొవిడ్ కారణంగా పోయింది. ఉద్యోగం పోయినా మనోస్థైర్యం మాత్రం కోల్పోని శారద జీవనాధారం కోసం దారులు వెతికింది. చివరికి హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు విక్రయిస్తున్న వైనం మీడియా కెక్కి సంచలనమైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన శారద కూరగాయలు విక్రయిస్తూ డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు ప్రతీకగా నిలిచిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు సోనూసూద్ స్పందించి ఉద్యోగం ఆఫర్ చేశాడు.ఈ విషయాన్ని పక్కనపెడితే శారద కూరగాయల దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కూరగాయలు విక్రయించిన తర్వాత మిగతా వాటిని బండిపైనే ఉంచి కవర్‌తో కప్పి రోజూలానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాతి రోజు దుకాణానికి వస్తే బండిపై ఉండాల్సిన కూరగాయలు మాయమయ్యాయి. మొత్తంగా రూ. 5 వేల విలువైన కూరగాయలు మాయమైనట్టు శారద ఆవేదన వ్యక్తం చేసింది.

* కురిచేడులో 10మంది మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి-కురిచేడు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి-మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి-వైసిపి మద్యం మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలి.-ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన చంద్రబాబుప్రకాశం జిల్లా కురిచేడులో 10మంది దుర్మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఇటీవల ఈ విధమైన దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి.

* జీజీహెచ్ నుంచి కనిపించకుండా పోయిన దుర్గా ప్రసాద్ ఆచూకీ లభ్యం.మార్చురీలో దుర్గా ప్రసాద్ మృతదేహం.4 రోజులుగా భర్త ఆచూకీ కోసం వెతుకుతున్న వెంకాయమ్మ.భర్త ఆచూకీ కోసం హైకోర్టులో పిల్ వేసిన వెంకాయమ్మ.హైకోర్టులో పిల్ వేయడంతో మార్చురీలో దుర్గా ప్రసాద్ మృతదేహం ఉన్నట్లు తెలిపిన వైద్యులు.

* ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు వివరాల్లోకి వెళితే వాకాడు మండలం వాకాడు గ్రామంలోని బిసి కాలనీలో ఈరోజు ఉదయం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆరుగురికి గాయాలు అయినట్లు తెలిపారు. వంట గదిలో గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే గ్యాస్ సిలిండర్ పేలి నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఆ ఇంట్లోని ఆరుగురు సభ్యులకు గాయాలయ్యాయి . వారిలో ముగ్గురు 14 ఏళ్లలోపు పిల్లలు ఉండటం మరింత విషాదంగా తెలుస్తుంది .సిలిండర్ పేలిన సంఘటన స్థలాన్ని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ,సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి సంఘటన జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .క్షతగాత్రులను వార్డులోని నేదురుమల్లి బాలకృష్ణ రెడ్డి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.