DailyDose

ఏపీలో లక్షన్నరకు చేరువలో కరోనా కేసులు-TNI బులెటిన్

ఏపీలో లక్షన్నరకు చేరువలో కరోనా కేసులు-TNI బులెటిన్

* దేశంలో అత్యధిక కరోనా కేసులున్న టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఏపీలో ఇప్పటివరకు 1.20 లక్షల పాజిటివ్ కేసుల వెల్లడయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించాక గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే, అనంతపురం జిల్లాలోనూ కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో అధికారులు కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు, వారిని నిత్యం ఉల్లాసంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. లక్షణాలు లేనివారే ఎక్కువ సంఖ్యలో ఉంటుండగా, వారిని కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వారికి క్రీడలు, సంగీతంతో కరోనా థెరపీ అందిస్తున్నారు. ఉదయం సుప్రభాతంతో ప్రారంభించి, ఆపై రోగులు తమకు ఇష్టమైన పాటలు వినే సదుపాయం కల్పించారు. అంతేకాదు, క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని రకాల క్రీడా ఉపకరణాలు అందుబాటులో ఉంచారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్ ఇలా అనేక క్రీడలతో అనంతపురం జిల్లా కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలు సందడిగా మారాయి.ఈ కేంద్రాల్లో ఆన్ లైన్ సినిమాలు చూసేందుకు వీలుగా ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్ టాప్, ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు కరోనా రోగుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చూసేందుకు కౌన్సెలింగ్ అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

* గంపలగూడెం మండలంలో మరో రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదు-తహశీల్దార్ బి.అసియ్య. గంపలగూడెం-1,అనుమ్మోలంక-1 గా నమోదైనట్లు పేర్కొన్న-తహశీల్దార్.

* ప్రతి జిల్లాలో కొవిడ్‌ ఆసుపత్రుల్లోని పడకల ఖాళీలు, భర్తీ వివరాలను ప్రదర్శించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. కొవిడ్‌ నివారణ చర్యలపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఆసుపత్రి హెల్ప్‌లైన్‌ సహా పడకల ఖాళీ వివరాలను బ్లాక్‌బోర్డుపై రాయాలని జగన్‌ సూచించారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీప ఆసుపత్రిలో బెడ్‌ కేటాయించాలన్నారు. కొవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల యాజమాన్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. బెడ్లు, వైద్యం, ఆహారం, శానిటేషన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలుంటే ప్రోత్సహించాలని సూచించారు. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5వేలు ప్రోత్సాహకం ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు.

* కొవిడ్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో కొవిడ్‌ ఆసుపత్రుల్లో పడకల ఖాళీలు, భర్తీ వివరాలు ప్రదర్శించాలని సూచించారు.‘‘ఆసుపత్రి హెల్ప్‌లైన్‌ నంబర్‌ సహా పడకల ఖాళీ వివరాలు బ్లాక్‌బోర్డుపై రాయాలి.ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీప ఆసుపత్రిలో బెడ్‌ కేటాయించాలి.రోగులకు ఆసుపత్రిలో బెడ్‌ దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు.హెల్ప్‌ డెస్క్‌లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కొవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి.సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

* కావలిలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న క్రమంలో షరతులతో కూడిన స్వల్ప లాక్ డౌన్పది రోజులు కొనసాగనున్న లాక్ డౌన్ ..శని, ఆది వారాల్లో కఠినమైన నిబంధనలువాహనాలు రోడ్ల పైకి వస్తే కోవిడ్ నియంత్రణ అతిక్రమణ కేసులు నమోదునిర్మానుష్యమైన రోడ్లు, ఇళ్లకే పరిమితమైన ప్రజలు. పోలీసుల పహరాలో కావలి.

* భారత్‌లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు దాటింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూశాయి.గురువారం 779 మరణాలు సంభవించాయి.

* నెల్లూరు కోవిద్ ఆస్పత్రిలో దారుణ పరిస్థితి★ కనీసం పేషెంట్లను పట్టించుకోని వైనం.★ బాత్‍ రూం‍లో కరోనా పేషెంట్ మృతి.★ ఎప్పుడు చనిపోయాడో కూడా తెలియని పరిస్థితి.★ మృతుడిని గమనించిన పారిశుద్ధ్య కార్మికులు.★ వైద్యులకు సమాచారమివ్వడంతో మరణించినట్లు నిర్ధారణ.

* తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది‌. గురువారం(30వ తేదీ) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,986 కరోనా పాజిటివ్‌ కేసులు.. 14 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 586, మేడ్చల్‌ జిల్లాలో 207 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 62,703కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 45,388 మంది కోలుకోగా.. 16,796 మంది చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 519 మంది ప్రాణాలు విడిచారు. నిన్న ఒక్కరోజు 21,380 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.