DailyDose

రోడ్డెక్కిన అమరావతి స్థానికులు. ఉద్రిక్తంగా పరిస్థితులు-నేరవార్తలు

రోడ్డెక్కిన రైతులు. ఉద్రిక్తంగా పరిస్థితులు-నేరవార్తలు

* రాజధాని గ్రామాలలో ఉద్రిక్తత నెలకొంది.మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధాని గ్రామాల్లో రైతులు ఒక్కసారిగా రోడ్డు మీదకు చేరుకొని ఆందోళనకు దిగారు.దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇస్తున్నారు.కొంతమంది రైతులను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.

* శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్యప్రకాశం జిల్లాలో మద్యం మహమ్మారికి 14 మంది బలయ్యారు.మద్యానికి బానిసైన వ్యసనపరులు మందు దొరక్క శానిటైజర్ తాగిన ఘటనల్లో 14 మంది మృతి చెందారు.కురిచేడులో శానిటైజర్ తాగి 11 మంది మృతి చెందగా, పామూరులో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మద్యం ధరలు పెంచటంతో శానిటైజర్ తాగుతున్నామని మందుబాబులు వాపోతున్నారు. 

* హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్రేన్‌ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలినట్లు సమాచారం. క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

* పారాణి ఆరలేదు.. తోరణాలు వాడలేదు. సందళ్లు ఆగలేదు.. సంబరాలకు సరిలేదు. నవ జంట నిండు నూరేళ్లూ ఆనందంగా జీవించాలని అందరి ఆకాంక్ష. ఊహించని దరిమిలా నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం ఆ ఇంట అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఏడిద సీతానగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌ఛార్జి ఎస్సై శివప్రసాద్‌ వివరాల మేరకు… ఏడిద సీతానగరానికి చెందిన మహాదాసు రమ్య శ్రీదేవి(20)కి మూడు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణపురం గ్రామంలో ఉంటున్న మేనమామతో బుధవారం వివాహమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఎలుకల మందు తింది. అస్వస్థతకు గురైన ఆమెను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. ఉన్నత చదువులు చదివేందుకు కుదరదనే బాధతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని బంధువులు భావిస్తున్నారు. తహసీల్దారు నాగలక్ష్మి వివరాలు నమోదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

* అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న డామన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన వందే భారత్‌ మిషన్‌ ప్రత్యేక విమానంలో ప్రయాణించిన 11 మంది ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్యాంట్ల లోపలివైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పాకెట్లలో బంగారం దాచుకొని తెస్తున్నట్టు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.1.66 కోట్లు ఉంటుందని తెలిపారు. 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.