DailyDose

మద్యం సేవించిన గ్రామ వాలంటీర్లపై వేటు-నేరవార్తలు

మద్యం సేవించిన గ్రామ వాలంటీర్లపై వేటు-నేరవార్తలు

* సచివాలయంలో మద్యం తాగిన ఇద్దరు గ్రామ వాలంటీర్లపై వేటు. తిరుపతి రూరల్ మంగళం బీటీ ఆర్ కాలనీలోని సచివాలయంలో 29న ఇద్దరు గ్రామ వాలంటీర్లు మద్యం తాగారు.గ్రామ వాలంటీర్ల వ్యవహారాన్ని తోటి వాలంటీర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.వాలంటీర్ల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినట్లు పంచాయతీ కార్యదర్శి సురేందర్రావు తెలిపారు.వాలంటీర్లు రెడ్డప్ప, ఢిల్లీ బాబును విధుల నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

* పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ5 మందికి గాయాలు. గాయపడిన వారిని పుట్లూరు ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ పోలీసు జీవులో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

* ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరు, చోడవరం గ్రామాలలో  పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.పిచ్చికుక్క దాడిలో దాదాపు 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.వారిని చికిత్స కోసం కొండేపి ఆస్పత్రికి తరలించారు. 

* తమిళనాడులో ఒక మత్స్యకారుడు శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. దీంతో ఆగ్రహించిన అతడి మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు.ప్రత్యర్థులకు చెందిన 20 పడవలు, రెండు బైకులు, కార్లకు నిప్పుపెట్టారు. వారి ఇండ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు.తజంగూడ మాజీ పంచాయతీ అధ్యక్షుడు మసీలమణి సోదరుడు మడివానన్ (36), శనివారం రాత్రి బైక్‌పై కడలూరు నుంచి గ్రామానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మాటువేసిన ప్రత్యర్థులు అతడిపై దాడి చేసి నరికి చంపారు.ఈ విషయం తెలిసిన వెంటనే మడివాసన్ అనుచరులు రెచ్చిపోయారు. ప్రత్యర్థులకు చెందిన 20 పడవలు, రెండు బైకులు, కార్లకు నిప్పుపెట్టారు. సుమారు పది ఇండ్లను ధ్వంసం చేశారు.ఈ దీంతో పోలీసులు ఇరు వర్గాలకు చెందిన 43 మందిని అరెస్ట్ చేశారు.

* ప్రకాశం జిల్లా అరెస్ట్ అయిన చీరాల ఎస్సైకి బెయిల్ మంజూరుచీరాల పోలీస్ కష్టడిలో మృతి చెందిన కిరణ్ కుమార్ కేసులో ఎస్సై విజయ్ కుమార్ కు బెయిల్ మంజూరు.ఎస్సై విజయ్ కుమార్ పై 304 ఆ సెక్షన్ ప్రకారం కేసు నమోదు.నిన్న సాయంత్రం కేసు నమోదు చేసి అరెస్టు చేయగా రాత్రికి బెయిల్ మంజూరు.