Sports

బీసీసీఐకు సిగ్గు లేదు

బీసీసీఐకు సిగ్గు లేదు

లద్దాఖ్‌ ఘర్షణల నేపథ్యంలో ప్రజలు చైనా వస్తువులను బహిష్కరిస్తుంటే.. ఐపీఎల్‌కు మాత్రం చైనా స్పాన్సర్‌ను కొనసాగించటంపై జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ధ్వజమెత్తారు. ‘‘చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెప్తూ.. చైనాకు చెందిన సెల్‌ఫోన్‌ ఉత్పత్తిదారులను ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగిస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలో అని మనం అయోమయంలో ఉంటే… ఆ దేశం మనను అపహాస్యం చేయడంలో ఆశ్చర్యం లేదు’’ అని ఆయన ట్విటర్‌ మాధ్యమంలో విమర్శించారు.