Movies

కొత్త ప్రయోగాలు

కొత్త ప్రయోగాలు

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయింది బెంగళూర్‌ బ్యూటీ ప్రణీతా సుబాష్‌. పవన్‌ కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’, ఎన్టీఆర్‌తో ‘రభస’, మహేష్‌ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించింది ప్రణీత. ఈ మధ్యే రామ్‌ ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించింది. సౌత్‌లో నాయికగా పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రణీత ఇప్పుడు హిందీలో కూడా జర్నీ మొదలుపెట్టింది. అజయ్‌ దేవగన్‌ ‘భూజ్‌’లో కీలకపాత్రలో కనిపించనుందామె. అలాగే ‘హంగామా’ అనే సినిమాలోనూ నటిస్తోంది ప్రణీత.