Movies

కృతి+క్రిష్

కృతి+క్రిష్

హృతిక్‌ రోషన్‌ తదుపరి చిత్రం ‘క్రిష్‌ 4’ అంటూ వార్తలొస్తున్నాయి. తన తండ్రి రాకేష్‌ రోషన్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆయన నాలుగు పాత్రల్లో కనిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. స్క్రిప్టు పనులు మొదలుపెట్టినట్టు రాకేష్‌ రోషన్‌ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హృతిక్‌ సరసన నటించబోయే నాయిక గురించి ఓ వార్త సందడి చేస్తోంది. ఇందులో కృతిసనన్‌ నటించబోతున్నట్టు బాలీవుడ్‌లో అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన కృతితో ఒప్పందం కుదిరినట్టుగా సమాచారం. క్రిష్‌ సిరీస్‌ చిత్రాల్లో హృతిక్‌కు జోడీగా నటించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రియాంకను ఈ కొత్త చిత్రంలో నటింపచేయడం అంత సులువుకాదని చిత్రబృందం భావించిందట.