Fashion

దానిమ్మగింజలతో అందం ఇనుమడింపు

దానిమ్మగింజలతో అందం ఇనుమడింపు

ఎర్రని దానిమ్మ గింజలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే సంగతి తెలిసిందే. చూడచక్కని ఈ గింజలతో అందానికీ మెరుగులూ దిద్దొచ్ఛు అదెలాగంటే…రెండు టేబుల్‌స్పూన్ల దానిమ్మ రసంలో టేబుల్‌స్పూన్‌ చొప్పున వెన్న, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. దానిమ్మ గింజల రసాన్ని వడకట్టకుండా బరగ్గానే వాడాలి.

*** తేమగా ఉండాలంటే..
దానిమ్మ రసం రెండు టేబుల్‌స్పూన్లు తీసుకుని దీంట్లో టేబుల్‌స్పూన్‌ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పొడిబారిన చర్మం తేమగా మారడమే కాకుండా మెరుస్తుంది కూడా.

*** వయసు ఛాయలిక దూరం..
మూడు టేబుల్‌స్పూన్ల దానిమ్మ రసంలో రెండు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జు కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. కలబందలోని పోషకాలు వయసు పైబడటం వల్ల ముఖంలో వచ్చే మార్పులను నియంత్రిస్తాయి.