DailyDose

ఏపీలో అత్యధిక కోవిద్ పరీక్షలు-తాజావార్తలు

ఏపీలో అత్యధిక కోవిద్ పరీక్షలు-తాజావార్తలు

* రాష్ట్రంలో కొవిడ్ నివారణ కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా అత్యధిక కరోనా పరీక్షలను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కడప జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్‌లో మంత్రి ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, వైకాపా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని కొవిడ్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తులతో మంత్రి ఆళ్లనాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

* ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. కొత్త సచివాలయం, నియంత్రిత సాగు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కరోనా కట్టడి చర్యలు, కొవిడ్ నేపథ్యంలో విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో కృష్ణా జలాల అంశం చర్చకు రానుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, రిటైల్‌ ట్రేడ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలపై చర్చించనున్నట్లు సమాచారం.

* ఓఎల్‌ఎక్స్‌లో ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు, గృహోపకరణాలను మాత్రమే అమ్మకానికి ఉంచేవారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఏకంగా యుద్ధ విమానాన్నే ఇందులో అమ్మకానికి పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్‌-23 యుద్ధ విమానాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి 2009లో ఐఏఎఫ్ బహుమతిగా ఇచ్చింది. దీనిని యూనివర్శిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల ముందు భాగంలో ప్రదర్శనకు ఉంచారు.

* అయోధ్యలో ఈరోజు జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాముడికి సంబంధించిన ఓ చిత్రాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చే సందర్భాన్ని తెలియజేసే చిత్రం అది.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని పిటిషన్‌లో కోరింది. శ్రీశైలం జలాశయం బ్యాక్‌ వాటర్‌ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది.

* సూర్యుడి కిరణాలు కూడా పడని చోటులో ఉన్న వారి సమస్యలను కూడా సమాజానికి చూపించే సత్తా ఉన్న స్త్రీ ఆమె. ఎందుకంటే ఆమె మైక్‌ పట్టి పలకరిస్తే, ప్రేమగా దగ్గరకు చేరే హృదయాలు ఎన్నో.. ఆమె మైక్‌ పట్టి ప్రశ్నిస్తే దొరికే సమాధానాలు ఇంకెన్నో.. బుల్లితెరపై ఆమె ఉంటే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌.. వెండితెరపై టౌన్‌ ఆఫ్‌ ది టాక్‌.. ఆమే యాంకర్‌ ఝాన్సీ.. కొన్ని వేల గులాబీల పరిమళం తన నవ్వు.. కొన్ని లక్షల తేనె చుక్కల మాధుర్యం తన మాట.. కొన్ని కోట్ల ఆశీస్సులు తన పాట.. ఆమే సింగర్‌ సునీత.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వీరిద్దరూ విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.