WorldWonders

కూతురిని కుక్కలా నాకి నిద్రలేపే తల్లి

కూతురిని కుక్కలా నాకి నిద్రలేపే తల్లి

మ‌నుషుల మీద కుక్క‌ల‌కు ప్రేమ ఎక్కువైతే నాలుక‌తో నాకుతూ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాయి. మ‌రి మ‌నుషుల‌కు కుక్క‌ల మీద ప్రేమ ఎక్కువైతే ఎలా చూపిస్తారు. వీరు కూడా కుక్క‌ల‌ను అదే మాదిరిగా నాకుతారా? అదేమో గాని ఈ త‌ల్లి కూతురును నాకుతూ నిద్ర‌లేపుతుంద‌ట‌. అలా చేయ‌క‌పోతే ఆ కూతురు నిద్ర‌లేవ‌దంట‌. అస‌లు వీరి క‌థేంటో ఇప్పుడు చూద్దాం. యూకేలో నివ‌సిస్తున్న 68 ఏండ్ల అలెన్‌కు 21 ఏండ్ల కూతురు ఉంది. ఆమె పేరు మ‌ర్సియా. మ‌ర్సియా చిన్న‌ప్ప‌టినుంచే ఎంజైమ్ లోపంతో బాధ‌ప‌డుతున్నది. ద‌త్త‌త తీసుకున్నా కూతురును అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. వీరిద్ద‌రూ చాలాఏండ్ల నుంచి కుక్క పిల్ల‌ల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మ‌ర్సియాను నిద్ర‌లేపేందుకు అలెన్ త‌న నాలుక‌తో మ‌ర్సియా ముఖాన్ని నాకుతుంది. దీనికంటే ముందు కుక్కలా అరుస్తుంది. ఇలా కాసేపు గారాబం చేస్తే గాని మ‌ర్సియా నిద్ర‌లేయ‌ద‌ట‌. ఇలా చేయ‌డం త‌ల్లీకూతుళ్లు ఇద్ద‌రికీ ఇష్ట‌మే. మామూలుగా మ‌ర్సియా కుక్క‌పిల్ల‌ను పెంచుకోవాల‌నుకున్న‌ది. అది కుద‌ర‌కపోవ‌డంతో తానే కుక్క‌పిల్ల‌లా మారిపోయింది. త‌ల్లి అలా చేయ‌డం మ‌ర్సియాకు చాలా ఇష్టం.