DailyDose

888 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం-నేరవార్తలు

888 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం-నేరవార్తలు

* వీరులపాడు మండలం అల్లూరు, పెద్దాపురం గ్రామాల వద్ద రాత్రి సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు…..ఈ తనిఖీల్లో అల్లూరు గ్రామం వద్ద 53 మద్యం బాటిల్స్, పెద్దాపురం గ్రామం వద్ద 853 మద్యం బాటిల్స్, మొత్తం 888 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు…..ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, వారి వద్ద నుండి ఒక లారీ, ఒక బైక్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేసిన పోలీసులు.

* రావులపాలెం మండలం రావులపాడులో ఇద్దరు చిన్నారులు ఆదృశ్యం. ఆరు ఏళ్లు, అయిదు ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు సాయంత్రం నుంచి నుంచి ఆదృశ్యం. కాలువ గట్లున గుడారంలో ఉంటున్న కుటుంబాలు. పిల్లలు ఆదృశ్యంతో రావులపాలెం పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు. కనిపించకుండా పోయిన పిల్లల కోసం పోలీసులు మూడు బృందాలుగా గాలింపు. ఇంతవరకు లభ్యం కాని పిల్లల ఆచూకీ.

* కంకిపాడు మండలం ఈడుపుగల్లులో ఖైదీ పరారీకృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో ఖైదీ పరారీకరోనా ఐసొలేషన్ వార్డు నుంచి పరారైన ఖైదీ వెంకటేశ్వరరావుహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ వెంకటేశ్వరరావుఈడుపుగల్లు ఐసొలేషన్‌ వార్డులో కరోనా సోకిన 17 మంది ఖైదీలకు చికిత్స

* గుజరాత్​ అహ్మదాబాద్​లోని శ్రేయ్​ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఐసీయూ వార్డ్​లో ఉన్న మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 40 మంది రోగులను రక్షించి నగరంలోని మరో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

* రామమందిరం భూమిపూజ కార్యక్రమం సందర్భంగా అసోం రాష్ట్రంలో రెండువర్గాల మధ్య జరిగిన అల్లర్లతో కర్ఫ్యూ విధించారు.సోనిట్‌పూర్ జిల్లాలో రామాలయం భూమి పూజ సందర్భంగా ఓ వర్గం వారు ర్యాలీ తీస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.ఈ అల్లర్ల సందర్భంగా ముష్కరులు ఓ కారు, మూడు మోటారుసైకిళ్లను దహనం చేశారు.గోరుదుబా, భరాహింగోరి గ్రామాల్లో జరిగిన అల్లర్లతో బుధవారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోనిట్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు.రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లను ఆపేందుకే తాము కర్ఫ్యూ విధించామని ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కలెక్టరు ఆదేశించారు.