జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి జరిగి నేటికి 75 ఏళ్లు అవుతున్నది.
హిరోషిమాపై అణు దాడి జరిగిన మూడు రోజుల తర్వాత నాగసాకిపై మరో అణుబాంబుతో అమెరికా దాడి చేసింది.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 15వ తేదీన జపాన్ లొంగిపోయింది.
తొలిసారి అమెరికా అణుబాంబును వాడింది హిరోషిమాపైనే.
జపాన్ సైనిక స్థావరంగా హిరోషియాకు గుర్తింపు ఉన్నది.
అందుకే ఈ నగరాన్ని అమెరికా టార్గెట్ చేసింది. యూఎస్ బీ-29 బాంబర్.. 4 టన్నుల లిటిల్ బాయ్ యురేనియం బాంబును దాదాపు 31500 ఫీట్ల ఎత్తు నుంచి డ్రాప్ చేశారు.
43 సెకన్ల తర్వాత పేలిన ఆ బాంబు… సుమారు 4వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను పుట్టించింది.
బాంబు వదిలిన ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతా నాశనమైంది.
ఈ దాడిలో దాదాపు లక్షా 40 వేల మంది మరణించారు.