Politics

దినపత్రికలతో ప్రయోజనం లేదు

దినపత్రికలతో ప్రయోజనం లేదు

ఓ వైపు అమరావతి పోరాటం..మరోవైపు మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మన కలలను మనమే సాకారం చేసుకోవాలని.. మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకమని ట్విట్టర్ వేదికగా ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ”అమరావతి అనేది చంద్రబాబు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల.. అది సాకారం అవ్వాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి. మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల లాభం లేదు” అని కేశినేని పేర్కొన్నారు.