Movies

మరో బరువు ఎత్తనున్న రకుల్…

మరో బరువు ఎత్తనున్న రకుల్…

రకుల్‌ చేయబోయే సినీ ప్రాజెక్టులు ఏంటా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్-క్రిష్‌ ప్రాజెక్టు ‘విరూపాక్ష’లో రకుల్‌ నటిస్తోందన్న గాసిప్స్‌ వచ్చాయి. కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’లోనూ, అర్జున్‌ కపూర్‌ సరసన నటించనుందని సమాచారం. ఒలింపిక్‌ మెడల్‌ విజేత, తెలుగు మహిళ కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను తీయాలని రచయిత, నిర్మాత కోన వెంకట్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. భారత వెయిట్‌ లిఫ్టింగ్‌లో తొలి పతకం సాధించిన మల్లేశ్వరి బయోపిక్‌లో రకుల్‌ నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇంత వరకు రకుల్‌ దానిపై స్పందించలేదు. కరణం మల్లీశ్వరి పాత్ర పోషించాలంటే బరువులను ఎత్తగలిగే శారీరక సామర్థ్యం ఉన్నవాళ్లయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. దానికోసమే సమంత, రకుల్‌లో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని అనుకున్నా.. చివరికి రకుల్‌వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఒకానొక సమయంలో తాప్సీని ఈ ప్రాజెక్టులో తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనను చిత్రబృందం చేసినట్లు సమాచారం. అయితే తాప్సీకి వేరే ప్రాజెక్టులు ఉండటంతో వీలుపడలేదని తెలిసింది. దీంతో త్వరలోనే కోన వెంకట్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసి రకుల్‌ను సంప్రదించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.