Health

బరువు తగ్గలేకపోతున్నారా?

బరువు తగ్గలేకపోతున్నారా?

ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. జీవనశైలి మార్పుల వల్ల తిన్నా తినకపోయినా విపరీతంగా లావైపోతుంటారు కొందరు. ఈ ఊబకాయంపై పచ్చదనం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పరిశీలించారు బార్సిలోనియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ పరిశోధకులు. ఈ పరిశోధనలో భాగంగా 20 నుంచి 85 ఏళ్ల మధ్య వయసుగల 2,300 మంది మహిళలను సర్వే చేశారట. ఎత్తు, బరువు, తీసుకునే ఆహారం, జీవనశైలి తదితర వివరాలన్నీ నమోదు చేసుకున్నారట. అవన్నీ క్రోడీకరించి చూడగా తెలిసిందేంటంటే… ఏ మహిళలైతే పచ్చదనానికి వీలైనంత దగ్గరగా జీవిస్తున్నారో, వారి బరువు సాధారణంగా ఉండాల్సినంత ఉంటోందట. మొక్కలకు దగ్గరగా ఉండటం వల్ల కలిగే మానసిక ఆనందం, తోటపని వల్ల జరిగే వ్యాయామం తదితర కారణాలన్నీ దీనికి దోహదం చేస్తున్నట్లు గమనించారు. సో, ఊబకాయంతో ఇబ్బందిపడే వారు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం మొక్కల మధ్య గడపడం మంచిదన్నమాట!