Agriculture

పశువుల్లో పునరుత్పాదక శక్తి ఇలా పెంపొందించవచ్చు

పశువుల్లో పునరుత్పాదక శక్తి ఇలా పెంపొందించవచ్చు

పశువుల్లో ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, జీవరసాల (హార్మోన్స్‌) ఉత్పత్తికి ఖనిజ లవణాలు ఎంతో అవసరమని హాలహర్వి మండల పశువైద్యాధికారి అశోక్‌ తెలిపారు. ఇవి లోపిస్తే.. పశువుల్లో ఎదుగుదల, జీర్ణప్రక్రియ, పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
ముఖ్యమైన ఖనిజ లవణాలు : కాల్షియం, ఫాస్ఫరస్‌, సోడియం, పొటాషియం, కాపర్‌, కోబాల్ట్‌, మెగ్నీషియం, క్లోరిన్‌, ఐరన్‌
***అందించాల్సిన మోతాదు
ఖనిజ లవణాన్ని రోజుకు ఒకసారి దూడలకు 5-20 గ్రా., పెయ్య దూడలకు 20-30 గ్రా., పాలిచ్చే పశువులకు 50-60 గ్రా. చొప్పున దాణాతో కలిపి పెట్టాలి. ఈ ఖనిజలవణ మిశ్రమం మార్కెట్లో వివిధ పేర్లతో దొరుకుతుంది.
***ప్రయోజనాలు
* దూడల్లో రోగ నిరోధకశక్తి పెరిగి,ఆరోగ్యంగా ఉంటాయి.
* సకాలంలో ఎదకు వస్తాయి.
* పునరుత్పత్తి ప్రక్రియ సక్రమంగా ఉంటుంది.
* పాల దిగుబడి పెరుగుతుంది.
* ఈనిన పశువుల్లో మాయ దిగడం, పాల జ్వరం వంటి సమస్యలు తలెత్తవు.
* పశువులు బట్టలు, మట్టి, కాగితాలు తినడం, మూత్రం తాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటాయి.
* చర్మం నిగనిగలాడుతూ, పశువులు ఆరోగ్యంగా కనిపిస్తాయి.