NRI-NRT

చైనా ఇండియాలపై ట్రంప్ మరో ఆర్డర్

చైనా ఇండియాలపై ట్రంప్ మరో ఆర్డర్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా పలుదేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలసిందే. తాజాగా అమెరికా తన పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. ఇప్పటివరకు కొనసాగుతోన్న ఆరోగ్య సూచన అత్యధిక స్థాయి(లెవల్‌-4)ని అమెరికా ఎత్తివేసింది. అయితే భారత్‌, చైనాతోపాటు మరో 50దేశాలకు నాలుగో స్థాయి సూచనను కొనసాగించింది. దీంతో భారత్‌, చైనా దేశాలకు ప్రయాణం చేయొద్దని అమెరికా అక్కడి పౌరులకు సూచించింది.