Health

ఇండియాలో 21లక్షల మందికి కరోనా-TNI బులెటిన్

ఇండియాలో 21లక్షల మందికి కరోనా-TNI బులెటిన్

* భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు దేశంలో 60 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే(శుక్రవారం) 933 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. మొత్తం 42,518 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 6,88,612 యాక్టివ్‌ కేసులు ఉండగా, 14,27,006 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. శనివారం రోజు 5,98,778 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 2,33,87,171 టెస్టులు పూర్తి చేశారు. కాగా పశ్చిమ బెంగాల్‌ కేసుల తీవ్రత అధికమవుతుండటంతో ఈ నెల 20,21,27,28,31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించేందుకు బెంగాల్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,74,318 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,523,841కు చేరింది. వీరిలో 12,533,535 కోలుకొగా.. 7,22,952 మంది చనిపోయారు.

* తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో 2257 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కి చేరింది. ఇందులో 22,568 కేసులు యాక్టివ్ గా ఉంటె, 54,330 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో 14 కొత్త కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం నమోదైన కరోనా మరణాల సంఖ్య 615 కి చేరింది. జీహెచ్ఎంసి పరిధిలో 464, జోగులాంబ జగిత్యాలలో 95, కరీంనగర్ లో 101, ఖమ్మంలో 69, మేడ్చల్ లో 138, నల్గొండలో 61, నిజామాబాద్ లో 74, పెద్దపల్లిలో 84, సిరిసిల్లలో 78, రంగారెడ్డిలో 181, సంగారెడ్డిలో 92, సిద్ధిపేటలో 63, వరంగల్ అర్బన్ లో 187 కేసులు నమోదయ్యాయి.

* కరోనావైరస్‌ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ వైద్యసంస్థ‌లు టీకాలను సిద్ధం చేస్తున్నాయి. మ‌న‌దేశంలో భారత్ బయోటెక్, జైడస్ కాడిలా అనే రెండు సంస్థలు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించాయి. అలాగే ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన‌ టీకాకు సంబంధించి భారత్‌లో మూడవ ద‌శ క్లినికల్ ట్రయల్ కోసం అనుమ‌తి పొందింది. ఈ టీకా దేశంలోని అంద‌రికీ చేరువ‌య్యేందుకు మోదీ ప్రభుత్వం ఇప్పటికే రెండు క‌మిటీల‌ను నియ‌మించింది. వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా పంపిణీ చేసే ప్రణాళికను సిద్ధం చేయడం ఈ క‌మిటీల  బాధ్యత. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం దేశంలో వ్యాక్సిన్ పంపిణీపై ఉన్నత స్థాయి సమావేశాలు నిరంతరం జరుగుతున్నాయి. వీటిలో ప్రధాన ప్రభుత్వ పరిశోధనా సంస్థల నిపుణులు, కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విదేశాంగ వ్యవహారాలశాఖ అధికారులు పాల్గొంటున్నారు.

* తెలంగాణ రాష్ట్ర కొరొనా బులిటెన్ విడుదలగడిచిన 24 గంటల్లో 2256 కొరొనా పాజిటివ్ కేసులు నమోదుకొత్తగా 14 మరణాలు- 615 కి చేరిన మరణాల సంఖ్యమొత్తం కేసులు 77 513 కాగా ఆక్టీవ్ కేసులు 22 568 ఉన్నట్లు వెల్లడి. GHMC- 464, వరంగల్ అర్బన్- 187, రంగారెడ్డి- 181, మేడ్చెల్- 138, కరీంనగర్-101, గద్వాల్-95, సంగారెడ్డి -92, కేసులు.